అనసూయ భరద్వాజ్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ.. బుల్లితెర మీద పలు షోస్ కి హోస్ట్ గా, జడ్జ్ గా పని చేశారు. బుల్లితెర క్వీన్ గా టెలివిజన్ రంగాన్ని ఏలిన అనసూయ.. సినిమాల్లో కూడా తనదైన మార్కు చూపించారు. ఒక పక్క సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూనే.. మరో వైపు క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాల్లో నటనకి స్కోప్ ఉన్న సినిమాల్లో నటిస్తూ అభిమానులని మెప్పిస్తున్నారు. క్షణం సినిమాలో ఆమె నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఐఐఎఫ్ఏ ఉత్సవం, సైమా అవార్డులు వరించాయి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయకి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్, సైమా, జీ సినీ అవార్డులు వరించాయి.
బుల్లితెర మీద షోలు, సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులని అలరిస్తుంటారు. రెగ్యులర్ గా అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్, ఫోటోలు, పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తుంటారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మేకప్ లేని ఫోటోలని షేర్ చేశారు. గతంలో కూడా ఆమె మేకప్ లేకుండా ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, లైవ్ లో వీడియో చాట్ చేయడం లాంటివి చేశారు. ఇప్పుడు కూడా అలానే ఇంట్లో మేకప్ లేకుండా తీయించుకున్న ఫోటోలను అప్ లోడ్ చేశారు. అయితే ఆ ఫోటోల్లో కూడా అనసూయ అందంగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సాధారణంగా మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేయడానికి సెలబ్రిటీలు భయపడతారు. కానీ ఈ విషయంలో అనసూయ భిన్నమనే చెప్పాలి. మేకప్ తో ఉన్న ఫోటోలనే కాకుండా అప్పుడప్పుడూ మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను కూడా అప్ లోడ్ చేస్తున్నారు. అయితే మేకప్ లో కంటే మేకప్ లేకుండానే ఇంకా సౌందర్యంగా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె పుష్ప 2, రంగ మార్తాండ సినిమాల్లో నటిస్తున్నారు. మరి అనసూయ వితవుట్ మేకప్ ఫోటోలను షేర్ చేయడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.