సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ల వారసులు సినిమాల్లోకి రావడం అనేది మామూలే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో వారసత్వ పరంపర కొనసాగుతోంది. కాకపోతే పేరెంట్స్ కి స్టార్డమ్ ఎంత ఉన్నా.. వారసులు హీరోహీరోయిన్స్ గా నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తప్పనిసరి. ఇప్పటికే ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ కుమార్తెలు హీరోయిన్స్ గా డెబ్యూ చేసి సక్సెస్ ఫుల్ గా రాణించడం అనేది జరగలేదు. ఇండస్ట్రీలో వారసులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు రెగ్యులర్ గా వస్తుంటారు. కానీ.. సక్సెస్ అవ్వాలంటే మాత్రం వారసత్వం పనికిరాదు.
అవకాశాల పరంగా తమ పేరెంట్స్ క్రియేట్ చేసిన ఫేమ్, నేమ్ హెల్ప్ అవుతాయేమోగానీ నిలబడాలంటే ప్యూర్ టాలెంట్ మాత్రమే మార్గం. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా డెబ్యూ చేసేందుకు సీనియర్ నటి, ఎమ్మెల్యే రోజా కూతురు అన్షుమాలిక రెడీ అవుతోందని టాక్. నటిగా రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా అభిమానులను సంపాదించుకున్న రోజా.. ఓవైపు పొలిటిషన్ గా కూడా ఏపీ రాజకీయాలలో దూసుకుపోతుంది. మరోవైపు రోజా కూతురు అన్షుమాలిక త్వరలో సినిమాల్లోకి రాబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి రోజా కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెడుతుందో లేదో తెలియదు గానీ, వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇటీవలే 19 ఏటలో అడుగుపెట్టిన అన్షుమాలికలో తెలుగు హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయని అంటున్నారు. అదీగాక అన్షు కూడా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగాలని కూడా కోరుకుంటున్నారు రోజా ఫ్యాన్స్, నెటిజన్స్. ఈ క్రమంలో ఓ స్టార్ హీరో తనయుడి సినిమా ద్వారా అన్షు డెబ్యూ చేయబోతోందని కథనాలు ఊపందుకున్నాయి.
విలక్షణ నటుడు విక్రమ్ తనయుడిగా ధృవ్ విక్రమ్ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్యవర్మ, మహాన్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే నటుడిగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. సోలోగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ట్రై చేస్తున్న ధృవ్ తదుపరి సినిమాలలో అన్షు మాలిక ఎంట్రీ ఇవ్వబోతుందని కోలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రోజా కూతురు అన్షుమాలిక యూఎస్ లోని ఫేమస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసినట్లు తెలుస్తుంది. సో.. అన్షుమాలిక ఇండస్ట్రీలోకి రావడం ఖాయమే అని టాక్. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
~Senior actor Roja’s daughter to enter films?~ https://t.co/IG2iG7oNFe
Senior actor Roja’s daughter to enter films?Actor-turned politician Roja has now completely involved in politics, as the tourism minister of Andhra Pradesh, after the formation of the chief minister … pic.twitter.com/6NE09hBfi1
— Snooper-Scope (@Snooper_Scope) September 19, 2022