సినీ ఇండస్ట్రీలో మాస్ ఆడియెన్స్ ని మెప్పించే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ – బి గోపాల్, బాలకృష్ణ – బోయపాటి శ్రీను ఇలా దాదాపుగా మాస్ అనేసరికి హీరో బాలకృష్ణ పేరే ఎక్కువసార్లు వినిపిస్తుంది. అంటే.. మాస్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకొని అందరు హీరోలు సినిమాలు చేశారు. కానీ.. బాలయ్య ఒక్కడే ఇప్పటికీ మాస్ సినిమాలు కంటిన్యూ చేస్తున్నాడని చెప్పవచ్చు. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్నాడు.
ఆ తర్వాత 108వ సినిమాను డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్నాడు. అయితే.. ఇండస్ట్రీలో మాస్ సినిమాలు తెరకెక్కించడంలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇప్పుడున్న దర్శకులలో బోయపాటి ఊరమాస్ అయితే.. కొరటాల శివది క్లాస్ టైప్. స్టార్ హీరోలతో సందేశాత్మక సినిమా చేస్తూనే అందులో స్టైలిష్ మాస్ అంశాలను జోడించి మెప్పించగలడు. డైలాగ్స్ పరంగా థియేటర్స్ లో విజిల్స్ వేయించగలడు. అలాంటి దర్శకుడు పక్కా మాస్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది. త్వరలో అదే జరగబోతుందని టాక్ నడుస్తుంది.
నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లానింగ్ జరుగుతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయనుండగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైనట్లు సమాచారం. అసలే మాస్ హీరో బాలయ్యతో మాస్ డైలాగ్స్ స్పెషలిస్ట్ కొరటాల సినిమా అంటేనే ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకుంటాయి. అందులో బాలయ్య సినిమాకు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అంటే.. ఆ మాస్ మేనియా థియేటర్స్ లో ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్ అంచనాలకే వదిలేయాలి.
ఇక ఇప్పటికైతే ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన అయితే బయటికి రాలేదు. కానీ.. కన్ఫర్మ్ అయితే మాత్రం సినిమా 2024 సమ్మర్ లో తెరమీదకు రానుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఓవైపు కొరటాల ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. మరోవైపు బాలయ్య గీతా ఆర్ట్స్ వారి ఆహా ఓటిటిలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో కోసం అగ్రిమెంట్ సమయంలోనే బాలయ్య.. అల్లు అరవింద్ తో ఓ సినిమా చేయాలనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమా కొరటాలతోనే ఉండబోతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంటుంది. మరి బాలయ్య, కొరటాల, రవి బస్రుర్ మాస్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#KoratalaSiva #NBK109 #GeethaArts #RaviBasur pic.twitter.com/ItCW33Cn8G
— Skyups Media (@skyupsMedia) September 19, 2022