శోభితా ధూళిపాళ.. ఈ తెలుగు అందం గురించి ప్రేక్షకులు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందంతో కుర్రాళ్ల మదిలో స్థానం సంపాదించింది. ఈ తెలుగు బ్యూటీ మొదట బాలీవుడ్ తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవన్ 2.0 సినిమాలో యాక్ట్ చేసింది. ఆ తరువాత పలు హింది సినిమాలో చేసి గుర్తింపు సంపాందించింది. ఇక అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమాతో ఈ తెలుగు భామ తెలుగు తెరకు పరిచయమైంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ధరించిన ఓ చీర అందరిని ఆకట్టుకుంది. ఇక దీని ఖరీదు ఎంత అని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. చివరకు శోభిత ధరించిన చీర ఖరీదు తెలిసి అందరు షాక్ అవుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. టాలీవుడ్ లో ఎప్పుడో గాని కనిపించరు. తెలుగమ్మాయి శోభిత..తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లోనే కాదు హలీవుడ్ సినిమాలోనూ నటిస్తుంది. తెలుగులో గూఢాచారి సినిమాతో పరియమైంది. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ భామ. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఈ అమ్మడికి మాత్రం తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. అయితే శోభితా పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బీజీగానే ఉంది. రివేంజ్ డ్రామాగా సాగే ‘మంకీ మ్యాన్’ సినిమాతో హాలీవుడ్ స్క్రీన్ కి శోభిత పరిచయమైంది. ఈ ప్రాజెక్టుకు నటుడు దేవ్ పటేల్ నిర్మాతగా వ్యవరిచాడు. ఈ బ్యూటీ హాలీవుడ్ రేంజ్ కి వెళ్లాడనికి కారణం ఈ బ్యూటీ ప్రత్యేక స్టైలే కారణంటూన్నాయి సినీ వర్గాలు.
ప్రసిద్ధ ఫ్యాషన్ తరణ్ తహిలియానీ రూపొందించిన ఓ చీర శోభిత ధూళిపాల ధరించింది. ఈ చీర కట్టులో అందరిని ఆ కట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. ఇక ఈ చీర కాస్ట్ ఎంత అని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. ఈ చీర ఖరీదు రూ.48 లక్షలు. ఇక ఈ అమ్మడు మాట్లాడుతూ..” సంప్రదాయ దుస్తులను వెస్టర్న్ లుక్ లో , సౌకర్యంగా ఉండేలా వేసుకోవడం అంటే నాకు నచ్చే స్టైల్. నిజానికి దుస్తుల కంటే ఆభరణాల ఫ్యాషన్ పైనే నాకు ఆసక్తి ఎక్కువ. నాన ఫ్యాషన్ స్టైల్ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది” అని శోభిత అన్నారు.