మాతృత్వం అనేది ప్రతి స్త్రీ కోరుకునే అపురూపమైన అనుభూతి. బిడ్డలను తొమ్మిది నెలలు కడుపులో మోసిన తల్లి.. వారు పుట్టిన క్షణాలను ఎన్నటికీ మరువలేదు. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి.. పురిటి నొప్పులను మర్చిపోయి.. బిడ్డ ఆనందంలోనే మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.. సింగర్ చిన్మయి. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో 20 ఏళ్లకు పైగా సింగర్ గానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆడియెన్స్ కి దగ్గరైంది. అలాగే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. సమాజంలో జరిగే వివాదాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది.
ఇక నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని ప్రేమించి పెళ్లాడిన చిన్మయి.. ఇటీవలే పండంటి కవలపిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలలో ఒకరికి ద్రిప్త అని, ఇంకొకరికి శర్వాస్ అని పేర్లు పెట్టినట్లు తెలిపింది. అయితే.. పిల్లలతో కలిసి ఎప్పుడూ ఫోటోలు బయటపెట్టని చిన్మయి.. తాజాగా పిల్లలిద్దరితో కలిసి ఓ పిక్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. రోజూ సోషల్ మీడియాలో చిర్రుబుర్రులాడే చిన్మయిని.. ఆమె పోస్ట్ చేసిన కొత్త పిక్ చూసి షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ చిన్మయి ఏం ఫోటో పెట్టిందంటే.. తన ఇద్దరు కవల పిల్లలకు పాలిస్తున్న పిక్ షేర్ చేసింది. అలాగే పిల్లలకు ఇలా పాలిస్తున్నానని, లోకంలో ప్రతి తల్లికి ఇదే అత్యుత్తమమైన మూమెంట్ అని చెప్పుకొచ్చింది చిన్మయి.
ఈ నేపథ్యంలో చిన్మయి పెట్టిన మాతృత్వపు పిక్ పై సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ అందరూ చిన్మయి ఫోటోపై స్పందిస్తున్నారు. కొందరు ఇలా పసిబిడ్డలకు పాలిస్తున్న ఫోటోలు షేర్ చేస్తే వాళ్ళకి దిష్టి తగిలే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు బాహుబలిలో శివగామిలా ఉన్నావని అంటుండటం విశేషం. ప్రస్తుతం చిన్మయి ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన చిన్మయి.. సమంతకు ఎక్కువ సినిమాలకు డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు ఇంటి వద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది చిన్మయి.