కొన్ని రంగాలతో మరికొన్ని రంగాలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం కాస్తా బంధంగా మారిన సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సిని పరిశ్రమకు, క్రికెట్ కు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రికెటర్లు హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. మరికొందరు రీలేషన్లో ఉండి విడిపోయిన సందర్భాలూ లేకపోలేదు. అదీ కాక ధోనీ, సచిన్ జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు సైతం వచ్చాయి. ఇప్పుడు ఇదే కోవలోకి మరో సినిమా చేరబోతుంది. అదే “శభాష్ మిథు”మూవీ. కానీ ఈ మూవీలో ఆమె ఓ క్రికెటర్ తో జరిపిన ప్రేమాయణం చూపిస్తారా? అది నిజమేనా? ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందా పదండి..
మిథాలీ రాజ్ మహిళ క్రికెట్ లోనే కాక, క్రీడాలోకంలో కూడా పరిచయం అక్కర్లేని పేరు. 23 సంవత్సరాల సుదీర్ఘ కెరిర్ లో ఎన్నో చిరస్మరణియ విజయాలను భారత జట్టుకు అందించింది. వ్యక్తి గతంగా మరే ఇతర ఆటగాళ్లు సాధించలేని ఘనతలు అందుకుంది. దేశంలో మహిళా క్రికెట్ కు ఆదరణ పెరగడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అందుకే మిథాలీని అభిమానులు ముద్దుగా లేడీ సచిన్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా హీరోయిన్ తాప్సీ లీడ్ రోల్ లో “శభాష్ మిథూ”అనే మూవీ ఈ నెల 15న విడుదల కానుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఒకటే చర్చ.. గతంలో వచ్చిన బయోపిక్ లలో చూపించినట్లుగానే వారి వ్యక్తిగత లవ్ స్టోరీస్ ని శభాష్ మిథూ లో కూడా చూపిస్తారా.. లేదా అన్నదే ఇప్పుడు బాలీవుడ్ లో మిస్టరీ ప్రశ్న.
మిథాలీ రాజ్ కి 39 సంవత్సరాలు. అయినా ఇంకా పెళ్లి చేసుకొక పోవడంతో అమెకు ఏమైనా లవ్ ఫెల్యూర్ స్టోరీస్ ఉన్నాయా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ రూమర్స్ ని మిథాలీ రాజ్ వాళ్ల మదర్ కొట్టిపారేశారు. కెరీర్ కోసమే ఆమె పెళ్లి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. మిథాలీ సైతం ఓ ఇంటర్వూలో తనకు సింగిల్ గా ఉండటం అంటేనే ఇష్టం అని చెప్పారు. గతంలో క్రికెటర్ శిఖర్ దావన్ తో ప్రేమాయణం నడిపినట్లు, ధావన్ ఆమె కోసం భార్యకు సైతం విడాకులు ఇస్తున్నట్లు కొన్నిఛానల్స్ వార్తా కథనాలు రాశాయి.
ఈ వార్తలపై అటు మిథాలీ కానీ, ఇటు ధావన్ కానీ స్పందించలేదు. అసలు మిథాలీ రాజ్ ఇంకా పెళ్లి చేసుకోక పోవడానికి బలమైన కారణాన్ని సినిమాలో చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విషయాలన్ని తెలియాలి అంటే సినిమా వచ్చే దాకా ఆగాల్సిందే. మిథాలీ రాజ్ పై వస్తున్న ఈ రూమర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.