సమంత లీడ్ రోల్‌లో పాన్ ఇండియా సినిమా శాకుంతలం అనే పిరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాళిదాసు రచించిన శకుంతలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం కేవలం సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా బృందం కూడా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ విషయం తెలుసుకున్న సామ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు సినిమా బృందం నుంచి షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాని చెప్పిన డేట్ కి విడుదల చేయలేకపోతున్నట్లు ప్రకటించారు.
నవంబర్ 4న ఈ సినిమాని విడుదల చేయడం లేదని.. ఎప్పుడు రిలీజ్ చేసేది త్వరలోనే ప్రకటిస్తామంటూ వెల్లడించారు. అయితే ఈ వాయిదాకు కారణం కూడా చెప్పుకొచ్చారు. “శాకుంతలం సినిమాతో మీకు గుర్తిండిపోయే అద్భుతమైన సినిమా అనుభూతిని ఇద్దామనుకున్నాం. అయితే అది 3డీలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని మా బృందం అభిప్రాయపడింది. అందుకు మాకు కొంతం సమయం పడుతుంది. మేము ముందు ప్రకటించిన తేదీని సినిమాని విడుదల చేయలేము. శాకుంతలం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మద్దతు లభించింది. ఈ విషయంలోనూ మీ మద్దతు ఉంటుందని భావిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటింస్తాం” అంటూ ప్రకటన విడుదలచేశారు.
We will be announcing the new release date soon!
‘#𝐒𝐡𝐚𝐚𝐤𝐮𝐧𝐭𝐚𝐥𝐚𝐦 𝐀𝐥𝐬𝐨 𝐈𝐧 𝟑𝐃’.@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials#Shaakuntalam3D pic.twitter.com/5frmUzwMcN— Gunaa Teamworks (@GunaaTeamworks) September 29, 2022