పాన్ ఇండియా సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో కనిపించే ఉత్సాహం వేరు. ప్రస్తుతం కోలీవుడ్ ఫ్యాన్స్ లో అలాంటి ఆనందమే కనిపిస్తోంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుండి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులు తమ బాహుబలిగా భావిస్తున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి, ప్రకాష్ రాజ్ తదితర స్టార్స్ నటించారు. ఈ సినిమా ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ అవుతోంది.
ఇక ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన పొన్నియన్ సెల్వన్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రెగ్యులర్ గా పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వకముందే తాను చూశానంటూ ఫస్ట్ రివ్యూ ఇస్తుంటాడు ఉమైర్ సంధు. దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్.. తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీకు కూడా ఫస్ట్ రివ్యూ అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టాడు. అలాగే సినిమాలో హైలైట్ అయ్యే పాయింట్స్ ఇవేనంటూ రేటింగ్ కూడా ఇవ్వడం విశేషం. అయితే.. ఇప్పటివరకూ ఎన్నో ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ అంటూ పోస్టులు పెట్టే.. ఉమైర్ సంధుకి నటి సుహాసిని మణిరత్నం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఉమైర్ సంధు పొన్నియన్ సెల్వన్ మూవీ గురించి రివ్యూ ఇస్తూ.. సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్, విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాడు. చియాన్ విక్రమ్, కార్తీ ప్రేక్షకుల మనసులు దోచుకుంటారని, ఐశ్వర్య రాయ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు తెలిపాడు. ఇక చాలా ట్విస్టులతో.. ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మొదటిసారి ఉమైర్ సంధు రివ్యూకి షాక్ తగిలినట్లు అయ్యింది. పొన్నియన్ సెల్వన్ తెరకెక్కించిన డైరెక్టర్ మణిరత్నం భార్య, నటి సుహాసిని.. ఉమైర్ సంధు రివ్యూపై స్పందించారు. ఏకంగా నువ్వు ఎవరంటూ ఉమైర్ ని అడుగుతూ కామెంట్ చేయడం విశేషం.
ఈ క్రమంలో ఉమైర్ రివ్యూపై సుహాసిని స్పందిస్తూ.. “అసలు మీరు ఎవరు? విడుదల కాని సినిమాను మీరెలా చూశారు?” అని కామెంట్ చేశారు. దీంతో ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. ఉమైర్ సంధు సినిమాలు చూడకుండానే రివ్యూ అంటూ పోస్టులు పెడుతుంటాడని కొందరు కామెంట్ చేయగా.. ఉమైర్ దుబాయ్ సెన్సార్ సభ్యుడని, అందుకే ముందే చూసి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో అసలు ఏమి జరిగిందనేది తెలియదు. కానీ.. సినిమాకు సంబంధించి సుహాసిని ఉమైర్ ని ప్రశ్నించడం మాత్రం నిజమేనని సమాచారం. ప్రస్తుతం ఉమైర్ పోస్ట్, సుహాసిని కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
That dubai chithappa#umairsandhu 😂😂#suhasini#PonniyinSelvan pic.twitter.com/oiFfeHuVYA
— Nammavar (@nammavar11) September 29, 2022