సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఆయన ఏం మాట్లాడినా నిజమే కదా అని అనిపిస్తుంది. అందరూ ఒక పర్సెప్షన్‌లో చూస్తే వర్మ మాత్రం భిన్నంగా వేరే పర్సెప్షన్‌లో చూస్తారు. తాజాగా తెలుగు నిర్మాతలు షూటింగ్స్ బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దీని మీద కూడా వర్మ స్పందించారు. టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఈ పరిస్థితి రావడానికి రాజమౌళినే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటీటీల వల్ల జనాలు థియేటర్స్‌కి రావడం లేదని నిర్మాతలు చేస్తున్న వ్యాఖ్యలని వర్మ కొట్టిపడేశారు. థియేటర్ల ప్రాబ్లమ్‌కి కారణం ఓటీటీలు కాదని, అసలు శత్రువులు రాజమౌళి, యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అని అన్నారు. జనాలు షార్ట్ వీడియోలకి అలవాటు పడిపోయారని, రెండు గంటల పాటు ఓపిగ్గా సినిమా చూడాలంటే రాజమౌళి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాలు మాత్రమే తీయాలని అన్నారు.
థియేటర్ల ప్రాబ్లెమ్ , ఓటిటి లు కాదు ..అసలు శత్రువులు @ssrajamouli and యూట్యూబ్ https://t.co/yxp8o4QEYh
— Ram Gopal Varma (@RGVzoomin) August 3, 2022
దీని వల్ల మిగతా దర్శకుల ఆలోచనా విధానం మారిందని, భారీగా ఖర్చు పెట్టి తీస్తే జనాలు వస్తారని దర్శకులు భావిస్తున్నారని, అందుకే సినిమాల బడ్జెట్ పెరిగిందని వర్మ అన్నారు. అందుకే టాలీవుడ్‌లో నిర్మాతలు సమ్మెకి కారణం రాజమౌళి అని, రెండు యూట్యూబ్ అని అన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. థియేటర్ల ప్రాబ్లెమ్ ఓటీటీలు కాదు, అసలు శత్రువులు రాజమౌళి అండ్ యూట్యూబ్ అని ట్వీట్ చేశారు. మరి వర్మ అభిప్రాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.