వివాదాలకు ఎదురీదే రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. టచ్ చేసేందుకు భయపడే సబ్జెక్టులని ఎంచుకుని కథలుగా మారుస్తారు. రాజకీయ నాయకుల బయోపిక్ లు, వారి చుట్టూ అల్లుకున్న నేపథ్యాన్ని కథాంశంగా తీసుకుని సినిమాలు చేయడంలో దిట్ట. ఈ కోవలో వచ్చినవే వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలు. తాజాగా ఈయన మరో రాజకీయ సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇటీవలే వర్మ ఏపీ సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్మ కలిశారు. ఆయనతో కలిసి లంచ్ కూడా చేశారు. తాను తీయబోయే సినిమా గురించి జగన్ తో చర్చించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్.
బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక సినిమా తీసేందుకు వర్మ, జగన్ ను కలిశారని వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడు ఏ పని చేసినా ట్వీట్ చేసే వర్మ.. జగన్ ని కలిసిన విషయం గురించి ఎలాంటి ట్వీట్ వేయలేదు. దీంతో ఇది ఆయన వ్యక్తిగత సమావేశం అని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ ను కలిసొచ్చిన తర్వాత వర్మ తన కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు. త్వరలోనే ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తీయబోతున్న అంటూ ట్విట్టర్ వేదికగా వరుస పెట్టి ట్వీట్స్ చేశారు. ఇప్పుడు తీయబోయేది బయోపిక్ కాదని, అంతకంటే లోతైన రియల్ పిక్ అని అన్నారు. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉండచ్చు గానీ రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని అన్నారు.
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .
రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన “వ్యూహం” కధ.. రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుందని అన్నారు. రాచకురుపు పైన వేసిన కారంతో.. బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రమని వెల్లడించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుందని.. మొదటి భాగంగా ‘వ్యూహం’, రెండవ భాగంగా ‘శపథం’ అని అన్నారు. ఈ రెండు భాగాల్లోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా వుంటాయని అన్నారు.
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తేరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలక్ట్రిక్ షాక్ పార్ట్ 2 ‘శపథం’తో తగులుతుందని వెల్లడించారు. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తీయడం లేదని ఎవ్వరూ నమ్మరు కనక.. ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. ఇక వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్.. ఈ వ్యూహం సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వర్మ చెప్పుకొచ్చారు.
వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ .
ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022