అశోక వనంలో అర్జున కల్యాణం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హాట్ టాపిక్ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రివ్యూ లక్ష్మణ్ తో కలిసి సినిమా యూనిట్ ఓ ప్రాంక్ ప్లాన్ చేశారు. ఫిలింనగర్ రోడ్డుపై విశ్వక్ సేన్ కారుకు అడ్డుపడి ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రాంక్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దానిపై డిబేట్లు మొదలయ్యాయి. డిబేట్ మాట్లాడుతూ యాంకర్ దేవీ నాగవల్లి కొన్ని వ్యాఖ్యలు చేయడంపై విశ్వక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా ఒక పెద్ద దుమారమే లేచింది. అయితే అసలు ప్రాంక్ ఐడియా ఎవరిది? ఎందుకు అలా చేశారు? ఎందుకు ఇష్యూ అవుతోంది? వంటి ప్రశ్నలకు స్వయంగా రివ్యూ లక్ష్మణ్ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాడు. ఈ కింది వీడియోలో లక్ష్మణ్ ఏం చెప్పాడో మీరూ చూసేయండి. ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.