బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్, రొమాంటిక్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొనె. రణ్‌బీర్‌తో బ్రేకప్ తర్వాత.. దీపిక జీవితంలోకి వచ్చాడు రణ్‌వీర్. కొన్నాళ్ల ప్రేమ తర్వాత వీరిద్ధరూ 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అవార్డ్ ఫంక్షన్, సినిమా ఈవెంట్స్ ఇలా ఎక్కడ చూసినా వీరే సందడి చేసేవారు. ఇక రణ్‌వీర్ అయితే భార్య దీపికపై తనకు ఎంత ప్రేమో సందర్భం వచ్చినా ప్రతి సారి వెల్లడించేవాడు. వీరి ప్రేమ, పెళ్లి బంధానికి పదేళ్ల పూర్తయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వార్త తెగ వైరలవుతోంది. అదేంటంటే.. త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అని. దీని గురించి ఇప్పటికే ఉమైర్ సంధు అనే ఫిల్మ్ క్రిటిక్.. దీపిక-రణ్‌వీర్‌ల మధ్య అంతా సవ్యంగా లేదని ట్వీట్ చేశాడు. దాంతో ఒక్కసారి అందరి అటెన్షన్ వీరి మీదకు మళ్లింది.
ప్రస్తుతం వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయని.. మరీ ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ వల్లే వీరిమధ్య విభేదాలు వచ్చాయంటూ బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. వీరి విడాకుల వార్తలు జోరుగా ప్రచారం అవుతుండటంతో.. ఈ జంట ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై దీపికా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్‌వీర్ తమ విడాకుల రూమర్స్‌పై స్పందించాడు.
‘దీపికాతో నాకు 2012లో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ఎన్నో ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ పదేళ్లలో తనపై నా ప్రేమ ఇంకా పెరిగింది. దీపిక నా లైఫ్‌లోకి వచ్చాక నా జీవితం ఇంకా అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు’ అని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం దీపికా తన తల్లి ఉజ్జల పదుకొనెతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. దీనిలో దీపికా చేతికి వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. అది గమనించిన నెటిజన్లు ‘‘హో.. దీపిక తన చేతికి వెడ్డింగ్ రింగ్ తీసేసింది.. అంటే వీరి విడాకుల వార్తలు నిజమేనా?’’ అని అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట నుంచి భవిష్యత్తులో ఎలాంటి ప్రకటన వెలువడుతుందో చూడాలి.