Sreemukhi: తెలుగు బుల్లి తెరపై ఎక్కువ ప్రజాదరణ ఉన్న లేడీ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. శ్రీముఖి ప్రస్తుతం అన్ని టీవీ ఛానళ్లలో షోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక, టీవీ షోలు, సినిమాలే కాకుండా స్పెషల్ ఈవెంట్లలో యాంకరింగ్‌తో అల్లాడించేస్తున్నారు. శ్రీముఖి తాజాగా, బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో యాంకరింగ్ చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్టేజిపై నటుడు అలీతో పాటు యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖిపై బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ముద్దుల వర్షం కురిపించారు. స్టేజిపైకి ఎక్కి నేరుగా శ్రీముఖి దగ్గరకు వెళ్లిన రణ్‌వీర్ మొదట ఆమెను కౌగిలించుకున్నాడు.
తర్వాత చేతులపై ముద్దులు పెట్టాడు. దీంతో శ్రీముఖి ఎంతో సంబరపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీడియోకు జతగా ‘‘ ఇది జరిగిందా?.. ఐ లవ్ యూ రణ్‌వీర్ సింగ్. ఇది జరిగేలా చేసినందుకు ఐ లవ్ యూ సైమా అవార్డ్స్’’ అని రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ అక్కా రణ్‌వీర్ సింగ్ నీ ఫేవరేట్ అని తెలుసు.. ఎట్టకేలకు సాధించావు’’.. ‘‘ రణ్‌వీర్ సింగ్ లాంటి మంచి వ్యక్తి ఉండడు’’.. ‘‘ సంతోషంతో మీకు రాత్రి నిద్ర కూడా పట్టి ఉండదు’’ అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా, ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో వచ్చిన ‘అదుర్స్’ అనే ఓ షోతో శ్రీముఖి యాంకర్‌గా పరిచయమైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘జులాయి’ సినిమాతో నటిగా మారింది. సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటించింది. ప్రేమ, ఇస్క్, కాదల్ హీరోయిన్‌గా ఆమె మొదటి సినిమా. శ్రీముఖ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘‘భోళా శంకర్’’లో నటిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మీకు దండం పెడతా… నా భర్తను తిట్టకండి: గాజువాక కండక్టర్ ఝాన్సీ