రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం తెలుగు, తమిల్, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో కొండపొలం సినిమాతో డీ గ్లామర్ రోల్ లో మెప్పించిన ఈ భామ.. ఆ తర్వాత టాలీవుడ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి. బాలీవుడ్ విషయానికి వస్తే.. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అటాక్, రన్ వే 34 చిత్రాలు ఇప్పటికే విడుదల కాగా.. ఇంకా 4 చిత్రాలు షూటింగ్, విడుదలకు రెడీగా ఉన్నాయి. అటు తమిల్ లోనూ మంచి ప్రాజెక్టులు చేస్తోంది. ఇండియన్ 2 సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే.. కానీ, ఆ చిత్రం షూటింగ్ వాయిదా పడింది.
రకుల్ ప్రీత్ సింగ్ వెండితెర మీద మాత్రమే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎంతో హాట్ గా, బోల్డ్ గా ఉంటుంది. తరచూ ఫొటో షూట్స్ తో తన అభిమానుల కోసం న్యూ లుక్స్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా చీరకట్టులో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. చీరకట్టులో అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంక ఫిట్ నెస్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో సమంత తర్వాత రకుల్ ప్రీత్ సింగే ఫిట్ నెస్ ఫ్రీక్ అని చెప్పాలి. ఆమెకు సొంతంగా కొన్ని జిమ్ సెంటర్లు కూడా ఉన్నాయి. తరచూ జిమ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను చైతన్య పరుస్తూ ఉంటుంది. జీవితంలో ఫిట్ గా ఉండటం ఎంత అవసరమో తెలియజెప్తూ ఉంటుంది. రకుల్ న్యూ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.