హాలీవుడ్ సినిమాలు చూసి మన ఆహా ఓహో అనుకోవడమే తప్పించి.. మన సినిమాలని వాళ్లు చూస్తారా? ఒకవేళ చూసినా సరే ఆదరిస్తారా అనే సందేహాలు చాలా ఉండేవి. కానీ గత కొన్నేళ్లలో ట్రెండ్ మారిపోయింది. తెలుగు సినిమా.. ప్రపంచ గర్వించే స్థాయికి చేరింది. ఇంకా చెప్పాలంటే రాజమౌళి అనే ఓ సాధారణ దర్శకుడు.. తెలుగు సినిమా స్థాయిని ఎవరికీ అందనంత ఎత్తులో పెట్టాడు. దీంతో టాలీవుడ్ గౌరవం పెరిగింది. ఏకంగా ఫారెనర్స్.. మన సినిమా చూస్తూ థియేటర్లలో విజిల్స్ వేస్తున్నారంటే మీరు సీన్ అర్ధం చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇది ఫారెన్ థియేటరా లేదంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటరా అని భ్రమపడ్డారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దర్శకుడు రాజమౌళి పేరు చెప్పగానే చాలామంది ‘బాహుబలి’ అంటారు. కానీ దానికి బాబు లాంటి సినిమా పదేళ్ల క్రితమే తీశాడు. అదే ‘ఈగ’. తెలుగు సినిమా అంటే హీరో కచ్చితంగా ఉండాల్సిందే అని ట్రెండ్ ని చెరిపేసి.. ఆఫ్టరాల్ ఈగతో సినిమా తీసి మరీ బ్లాక్ బస్టర్ కొట్టిన ఘనత రాజమౌళి వల్లే సాధ్యం. ఇక ఈ సినిమాల్లో ఒక్కో సీన్ గురించి ఎంత మాట్లాడుకున్నా సరే తక్కువే. ఎందుకంటే ఓ హీరో విలన్ పై పగ తీర్చుకోవడం చాలా కామన్. కానీ ఓ ఈగ రివేంజ్ విలన్ పై ఎలా రివేంజ్ తీర్చుకుంది అనేదే ఈ స్టోరీ.
ఈ సినిమాలో నాని, సమంత, సుదీప్ లాంటి స్టార్స్ నటించారు. కానీ క్రెడిట్ మొత్తం ఈగ కొట్టేసింది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ద గ్రేట్ దర్శకుడు రాజమౌళి. అప్పట్లో తెలుగు సినిమాకు గుర్తింపు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల ఈ సినిమా కొద్దిమందికి తెలుసు. ఇక ‘బాహుబలి’ టూ పార్ట్స్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళి రేంజ్ ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లిపోయింది. దీంతో రాజమౌళి గతంలో చేసిన చిత్రాలన్ని.. ఫారెనర్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే లాస్ ఏంజెల్స్ లో జరిగిన ‘బియాండ్ ఫెస్ట్’లో ఈగ మూవీ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు వచ్చిన ఫారెనర్స్.. ప్రతి సీన్ కి తెగ ఎగ్జైట్ అవుతూ కనిపించారు. ఇక ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ కి అయితే టెన్షన్, రిలాక్స్, హ్యాపీ.. ఇలా మనిషిలో ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అన్నింటినీ బయటపెట్టారు. మూవీ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్లిన దర్శకుడు రాజమౌళికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈ మొత్తం వీడియోని నిర్మాణ సంస్థ ‘వారాహి చలన చిత్రం’ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. మరి ‘ఈగ’ సినిమాకు ఫారెనర్స్ ఇచ్చిన రియాక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.