SS రాజమౌళి.. ఈయన బాహుబలి రాకముందు వరకు డైరెక్టర్. వన్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఓ బ్రాండ్ అయిపోయాడు. ఈ ఏడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో విదేశీ ప్రేక్షకులతో హాలీవుడ్ డైరెక్టర్స్ మనసులు కూడా గెలుచుకున్నాడు. అలాంటి జకన్న.. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దాన్ని చూసిన మహేశ్ ఫ్యాన్స్ఆనందం పట్టలేకపోతున్నారు. అప్పుడే పండగ చేసుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరో మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. తొలి షెడ్యూల్ ఈ మధ్య పూర్తయింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని షూటింగ్ పూర్తవగానే మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు కోసం రెడీ అయిపోతాడు. ఈ ప్రాజెక్టు గురించి ఆల్రెడీ మాట్లాడిన జక్కన్న.. భారీ యాక్షన్ అడ్వెంచర్ చేయనున్నామని చెప్పేశాడు. దీంతో అప్పుడే ఈ సినిమా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
ఇకఈ సినిమా కోసం డైరెక్టర్ రాజమౌళి.. ప్రముఖ హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ (CAA)తో భాగమయ్యాడనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరైన జక్కన్న.. అక్కడి సినీ క్రిటిక్స్ తో ముచ్చటించారు. ఇలా హాలీవుడ్ వరకు తన స్టాండర్డ్స్ ని పెంచుకున్న రాజమౌళి.. మహేశ్ మూవీలో హాలీవుడ్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ ని అతిథి పాత్రలో నటింపజేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం ఈ వార్త గాసిప్. సో దీనిపై క్లారిటీ రావాలంటే.. మూవీ టీమ్ స్పందించాలి. మరి మహేశ్ చిత్రంలో హాలీవుడ్ స్టార్ యాక్ట్ చేస్తారనే విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#SSMB29 Strong Buzz;#ChrisHemsworth (Thor) Likely To Play a Extended Cameo Along With #MaheshBabu
Directed by #SSRajamouliShoot Starts From 2023 pic.twitter.com/erWV6TkM6C
— Roshan (@iamRoshan_07) September 24, 2022
ఇదీ చదవండి: హాలీవుడ్ ప్రేక్షకుల కోసం నా డైరెక్షన్ మార్చుకోను: రాజమౌళి!