సినీ తారలు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో, సినిమా ఈవెంట్స్ లో తదుపరి సినిమా టైటిల్స్ ని లీక్ చేయడం చూస్తుంటాం. అలాగే కొందరు సినిమాలోని క్యారెక్టర్స్ లేదా వేరేదైనా విషయాన్ని చెప్తేస్తుంటారు. మరికొందరైతే తమ సినిమాల గురించి మాట్లాడే క్రమంలో వేరే సినిమాల విషయాలను షేర్ చేసుకుంటారు. అలా ఒక్కసారి నోట్లో నుండి బయటికొస్తే చాలు ఫ్యాన్స్ కి పండగే అవుతుంది. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి.. “ఆదిపురుష్” సినిమా గురించి, హీరో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ఇండియన్ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో దేశవ్యాప్తంగా సాలిడ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. సినిమాల ఫలితాలను పక్కనపెట్టి భారీ బడ్జెట్ సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. దీనికి తోడు బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆదిపురుష్.
రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ కెరీర్ లో రాబోతున్న మొదటి పౌరాణిక చిత్రమిది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. తాజాగా ఆదిపురుష్ సినిమాపై, ప్రభాస్ పై రాజమౌళి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆదిపురుష్ ఎలా ఉంటాడో తనకు తెలుసని తెలిపాడు. ఈ సినిమా గురించి ప్రభాసే చెప్పినట్లు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఆదిపురుష్ పోస్టర్ కూడా తనెప్పుడో చూశారంట.
ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్తుందని తెలిపారు. అంటే ఇప్పుడు ప్రభాస్ కెరీర్ ఓ రేంజ్ లో ఉందని, దాన్ని ఇంక పైకి తీసుకెళ్లే సినిమా ఆదిపురుష్ అవుతోంది అంటూ కామెంట్స్ చేశారు. మరి.. ప్రభాస్ పై రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
ఇదీ చదవండి: Ashu Reddy: బెడ్‌పై అషు రెడ్డి హాట్ స్టిల్స్.. ఇది ఓయో రూమ్ లోనే అంటున్న నెటిజన్స్!
ఇదీ చదవండి: Surya: ఓ సినిమా కోసం సూర్య ఇంత కష్టపడతాడా? హేట్సాఫ్ సూర్య!