సినీ తారల విషయంలో డేటింగ్ రూమర్లు రావడం కామనే. కానీ వీటిపై ఎవరూ అంత ఈజీగా నోరు విప్పరు. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం తాను గతంలో చాలా మందితో డేటింగ్ చేశానని వెల్లడించింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే..!
సెలబ్రిటీల డేటింగ్ వార్తలపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎవరు ఎవరితో ప్రేమాయణం నడిపిస్తున్నారు, వారి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్తుందా అనేది ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా సినీ తారల లవ్ ఎఫైర్స్ తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిపై మూవీ సెలబ్రిటీలు ఓపెన్‌గా మాట్లాడేందుకు అంతగా ఇష్టపడరు. కానీ కొందరు మాత్రం చాలా బోల్డ్‌గా ప్రతి విషయాన్ని చెప్పేస్తుంటారు. అలాంటి తారల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. నాలుగు పదుల వయసులోనూ చూపులు తిప్పుకోనివ్వని స్టన్నింగ్ లుక్స్‌తో అందర్నీ మెస్మరైజ్ చేస్తోందీ భామ. నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలు చేస్తోంది ప్రియాంక.
నిక్ జోనస్‌తో ప్రేమ, పెళ్లికి ముందు ప్రియాంకపై అనేక రూమర్లు వినిపించాయి. పలువురు హీరోలతో ఆమె డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. అలెక్స్ కూపర్ ‘కాల్ హర్ డాడీ’ పాడ్‌కాస్ట్‌లో ప్రియాంక ఆసక్తికర విషయాలను పంచుకుంది. నిక్ జోనస్‌ను కలవడానికి ముందు తాను కొందరిని ప్రేమించానని ఆమె బయటపెట్టింది. ఒకరితో బ్రేకప్ అవ్వగానే మరొకర్ని ప్రేమించేదాన్నని పిగ్గీ చాప్స్ వెల్లడించింది. ఒకరితో రిలేషన్‌షిప్‌కు మరొకరితో రిలేషన్‌షిప్‌కు మధ్య పెద్దగా గ్యాప్ కూడా ఇవ్వలేదని.. అదే సమయంలో నటిగానూ చాలా బిజీగా ఉండేదాన్నని ప్రియాంక పేర్కొంది. తనతో పనిచేసిన వారితో డేటింగే చేసేదాన్నని.. కొందరితో బంధాలు విషాదంగా ముగిశాయని ఆమె వ్యాఖ్యానించింది.
‘చాలా మందితో డేటింగ్ చేశా. అందులో కొందరితో బంధాలు విషాదంగా ముగిశాయి. నేను డేట్ చేసిన వారందరూ అద్భుతమైన వ్యక్తులు. అయితే ఆఖరి బ్రేకప్ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టేందుకు చాలా సమయం తీసుకున్నా. ఇన్ని బ్రేకప్స్ ఎందుకు అయ్యాయని ప్రశ్నించుకున్నా. అనంతరం నిక్ జోనస్‌ను కలిశా. అతడు నా లవర్‌గానే కాదు భర్తగానూ ప్రమోషన్ తీసుకున్నాడు. నిక్ కూడా నా కంటే ముందు చాలా మందిని ప్రేమించాడు. అతడి గతం కంటే భవిష్యత్తు పంచుకోవడమే నాకు ముఖ్యం అనిపించింది. తనతో లైఫ్‌ను కొనసాగించాలని డిసైడ్ అయ్యా’ అని ప్రియాంక చోప్రా వివరించింది. కాగా, నిక్ జోనస్ గతంలో మిలీ సైరస్, సెలీనా గోమెజ్, ఒలీవియా కుల్పో, లిలీ కొల్లిన్స్, కెండల్ జెన్నర్, కేట్ హడ్సన్ లాంటి హాలీవుడ్ సెలబ్రిటీలతో ప్రేమాయణం నడిపాడు. కాగా, కొంతకాలం డేటింగ్ చేసిన నిక్-ప్రియాంకలు 2018లో పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. వీళ్లకు మాల్తీ అనే గారాలపట్టి ఉంది.
On a podcast, #PriyankaChopra revealed that she ended up dating her co-stars in the past and would go from one relationship to another. pic.twitter.com/zgkiZ9xvb3
— Filmfare (@filmfare) May 11, 2023