పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈయన టాలీవుడ్ రేంజ్ నుంచి వరల్డ్ ఫేమస్ యాక్టర్‌గా ఎప్పుడో మారిపోయాడు. అందుకు డార్లింగ్ చేసే సినిమాలే నిరదర్శనం. ఇప్పుడు ప్రభాస్ నుంచి రానున్న అన్ని ప్రాజెక్టు రూ.300 కోట్ల బడ్జెట్‌కి పైనే గానీ, తక్కువలో మాత్రం ఉండటం లేదు. అంతేకాకుండా ఒక్కో సినిమాకు రూ.120 కోట్లు దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటూ తన రేంజ్ ఏంటో పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వచ్చేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ క్రేజ్, స్థాయి మరో స్థాయికి వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ఆదిపురుష్ టీజర్ లుక్ పోస్టర్ చూసి కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూడటం ప్రారంభించారు. అయితే సంక్రాంతి కానుగా ప్రభాస్ ఆదిపురుష్ విడుదల కానుంది.
ఇప్పుడు ప్రభాస్ రేంజ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు అతని ఫ్యాన్స్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదికూడా అలా ఇలా కాదు.. తమ అభిమాన హీరో పేరును ఏకంగా గిన్నీస్ బుక్‌లో ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగు సినిమా అంటే గతం నుంచి ఇప్పటివరకు హీరో కటౌట్లకు ఎంతో క్రేజ్ ఉంది. అభిమానులు వారి అభిమానాన్ని చాటుకోవడం కోసం పెద్ద పెద్ద కటౌట్లు కడుతూ ఉంటారు. ఇప్పుడు డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆ కటౌట్‌తోనే రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఏ హీరోకి కట్టనటువంటి స్థాయిలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజుకి కటౌట్ కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 220 అడుగల కటౌట్‌ని కట్టేసి ఇప్పటివరకు రికార్డులను తిరగరాసేందుకు ప్లాన్ చేశారంటున్నారు. దాంతో గిన్నిస్ రికార్డు కూడా క్రియేట్ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే అన్నంత పని చేస్తారంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇంక ప్రభాస్ విషయానికి వస్తే.. పెదనాన్న కృష్ణంరాజు దూరమైన రోజు నుంచి ఎంతో బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం రోజు కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా దాదాపు లక్ష మంది అభిమానులకు 20 రకాల నాన్ వెజ్ వంటకాలు సహా 50 రకాల వెరైటీలతో భోజనం పెట్టాడు. అంత బాధలోనూ వచ్చిన అభిమానులు అందరికీ ఎంతో ఆప్యాయంగా ఎన్నో రకాల వంటకాలు చేయించి కడుపు నింపాడు. ఆ భోజనాల కోసం ఏకంగా ప్రభాస్ రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రీల్ మీద మాత్రమే కాదు.. ప్రభాస్ రియల్‌గానూ హీరోనే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి.. ప్రభాస్ ఫ్యాన్స్ తలపెట్టిన రికార్డు కటౌట్ విషయం ఎంతవరకు నిజం అనేది తెలియాలి అంటే అక్టోబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే.
#Mogalthuru welcomes #Prabhas and #KrishnamRaju family with utmost love and affection. 💕
Emotional day for the whole family and the Mogaluthuru people. 🙏
Prabhas gets a royal welcome. #PrabhasatMogalthuru ✨ pic.twitter.com/kOpNSD1iS9
— SumanTV (@SumanTvOfficial) September 29, 2022