సినిమా ఇండస్ట్రీలోకి రావడం, నిలదొక్కుకోవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. కొందరికి బ్యాగ్రౌండ్, సపోర్ట్, ఆఫర్లు ఉన్నా కూడా జనాలను ఆకర్షించలేకే నానా తిప్పలు పడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే తాను గెలవడానికే వచ్చాను.. మీ ఆదరణ కచ్చితంగా పొందుతానంటూ చెబుతున్నాడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. ఇతని పేరు సోషల్ మీడియా, మీమ్ పేజెస్ ఫాలో అయ్యే వాళ్లు అందరికీ తప్పకుండా తెలిసుంటుంది. ఎందుకంటే గత కొద్దిరోజులుగా ఇతని గురించి ఎన్నో వార్తలు, మరెన్నో సెటైర్లు, ఇంకెన్నో మీమ్స్. అయితే వాటన్నింటిని ఎంతో పాజిటివ్‌గా తీసుకున్న తండ్రి ప్రభాకర్ పబ్లిసిటీ అయితే బాగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.
ప్రభాకర్ తన తండ్రి అని చెప్పుకుని ఇండస్ట్రీలో బతికేద్దామని అయితే ఈ కుర్రాడు వచ్చినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే అతని సోషల్ మీడియా చూస్తే అతను ఏం చేసినా తనలో ఉన్న నటుడిని ప్రజలకు పరిచయం చేయాలనే చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది. తండ్రి పేరు చెప్పుకుని ఏలాగోలా గడిపేద్దాం అనుకునే వాడు అయితే కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. చంద్రహాస్ వర్కౌట్స్, ప్రాక్టీస్‌చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో మనోడు చేసే స్టంట్స్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. సెలబ్రిటీ కొడుకుని నాకేంటి అని కాకుండా ఉదయాన్నే లేవడం కసరత్తులు, వ్యాయామం, ప్రాక్టీస్ ఇలా అన్నీ చేస్తూ లైఫ్‌లో హీరోగా సెటిల్ అయ్యేందుకు కష్టపడుతున్నాడు.
ఇంక చంద్రహాస్ సినిమాల విషయానికి వస్తే.. తన 22వ పుట్టినరోజు సందర్భంగా ప్రభాకర్ దంపతులు ప్రెస్‌మీట్ పెట్టి తన కుమారుడిని హీరోగా పరిచయం చేయబోతున్నాం అని ప్రకటించాడు. అదే సమయంలో సినిమా రిలీజ్ కాకుండానే అతని టాలెంట్ చూసి మరో రెండు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయని చెప్పిన విషయం తెలిసిందే. అంటే చంద్రబాస్ మొత్తం 3 సినిమాలు తీయబోతున్నాడు. ప్రస్తుతం బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ అనే సినిమాకి సంబంధించి టీజర్ కూడా వచ్చింది. ఆ సినిమాలో చంద్రహాస్ యాక్టింగ్ ఇరగదీశాడని కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ కూడా పాడుతున్నాడు. సినిమాకి సంబంధించిన అన్ని అప్‌డేట్లను వరుసుగా విడుదల చేస్తూ వస్తున్నారు.