సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు.. అందంతో పాటు నటన కూడా ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెండూ ఉన్నాగానీ విజయాలు ఉండకపోవచ్చు. ఈ క్రమంలోనే హీరోయిన్ల విషయానికి వస్తే వారు పరిశ్రమలో ఉండాలన్నా.. వరుసగా అవకాశాలు రావాలన్నా, చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది గ్లామర్ షో. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫొటో షూట్ లు చేసి తమ తమ బ్లాగ్ ల్లో షేర్ చేసి మేకర్స్ దృష్టిలో పడాలన్నది వారి ఆలోచన. అదీ కాక ఇండస్ట్రీలో తమ రోల్ మోడల్ అయిన హీరోలపై సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళం బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా హీరో ధనుష్ పై తనకున్న ప్రేమను వ్యక్త పరిచింది. అతడంటే పిచ్చి అని, అతడే నా క్రష్ అంటూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రియా ప్రకాశ్ వారియర్.. ‘ఒరు ఆధార్ లవ్’ అనే ఒకే ఒక చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది ప్రియా. ఆ సినిమాలో కన్ను కొట్టే సీన్ అందరికి గుర్తే.. ఆ ఒక్క సీనే ఆమెను హీరోయిన్ గా నిలబెట్టింది అనడంలో సందేహం లేదు. అంతలా ఆ సీన్ ప్రేమికుల్లో ముద్ర వేసుకుంది. ఇక ఆ చిత్రం తర్వాత అనేక సినిమా అవకాశాలు ప్రియా ను వెతుక్కుంటూ వచ్చాయి. దాంతో అమ్మడు మలయాళం, తమిళం లాంటి పలు బాషల్లో తెగ బిజీ అయిపోంది. ఈ క్రమంలోనే తెలుగులో హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అనంతరం జాంబిరెడ్డి మూవీ హీరో తేజ సజ్జతో ఇష్క్ అనే చిత్రంలోనూ నటించింది. తర్వాత తెలుగులో అనుకుంతగా అవకాశాలు రాలేదు. దాంతో వెకేషన్ కు వెళ్లిన ఈ బ్యూటీ బీచ్ ఫొటోలతో కుర్రకారుల మతులు పోగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో తళుక్కున మెరిన ప్రియాకు.. అక్కడ విలేకరుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.
ఈ క్రమంలో.. హీరో ధనుష్ గురించి మీరు ఇన్ స్టాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించగా..”ధనుష్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అతడే నా క్రష్.. ఇక ఇదో రకమైన పిచ్చి అంటూ చెప్పుకొచ్చిన ప్రియా వారియర్.. ఆయన సరసన నటించాలని తన మనసులోని కోరికను ఈ సందర్భంగా బయటపెట్టింది. ఆయన పక్కన నటించే అవకాశం రావాలని, త్వరలోనే ఆ రోజు వస్తుందన్న నమ్మకం నాకుంది” అంటూ పేర్కొంది. అయితే ఈ మలయాళీ భామ దక్షిణాదిలో ఇప్పటికే అన్నిభాషల్లో అడుగుపెట్టింది. కోలీవుడ్ లో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దాంతో ఈ అమ్మడు కన్ను తాజాగా కోలీవుడ్ పై పడిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రియా వారియర్ తెలుగు, మలయాళం, బాలీవుడ్ లో పలు చిత్రాలు చేస్తూ.. బిజీగా ఉంది.