సినీ పరిశ్రమ అనేది గ్లామర్ తో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ ఆహారం దొరకాలంటే కొంతమందికి కష్టంతో కూడుకున్న వ్యవహారం. అందుకే అటు సినిమా వాళ్ళ అటెన్షను, ఇటు ప్రేక్షకుల అటెన్షను విత్ డ్రా చేయడానికి డిజిటల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తుంటారు. పరువాలను పారబోస్తుంటారు. సోయగాల షో చేసి సొమ్ము చేసుకుంటారు. ఊరికే అందాలను ఆరబోయడానికి హీరోయిన్లు ఏమైనా పిచ్చోళ్లా? ప్రతి నెలా ఈఎంఐలు కట్టుకోవడం మొదటి టార్గెట్ అయితే.. ఈ హీరోయిన్ లో ఏదో టాలెంట్ ఉంది అనుకుని మన సినిమాలో అవకాశం ఇద్దామని ఏ నిర్మాతో అనుకోవడం రెండో టార్గెట్. ఇలా సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలతో షేక్ చేస్తూ తమ టార్గెట్లని రీచ్ అవుతారు. ఈ కోవకి చెందిన హీరోయినే పూనమ్ బజ్వా.
‘మొదటి సినిమా’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. బాస్, వేడుక, పరుగు, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరి బతకడానికి ఏదో టాలెంట్ చూపించాలి కాబట్టి సోషల్ మీడియాలో అందాలను చూపిస్తూ.. నాలుగు రాళ్లు సంపాదించుకుంటుంది. ఆ మధ్య జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు, బోల్డ్ పిక్స్ పెట్టేది ఫ్యాన్స్ కోసమే..వాళ్ళు లైక్ కొడితేనే తాను ప్రతి నెలా ఈఎంఐలు కట్టుకోగలను అని చెప్పుకొచ్చింది. ఈ కోవలోనే నటి పూనమ్ బజ్వా కూడా తన ఫాలోవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తూ నెల నెలా ఈఎంఐలు కట్టేసుకుంటుంది కాబోలు.
మామూలుగా హీరోయిన్లు కొంచెం ఎక్స్ పోజింగ్ చేస్తేనే అందాల ఆరబోత అంటారు. కానీ ఆరబోతలో ఎక్స్ ట్రీమ్ లెవల్. ఈమె ఆరబోతని చూసి అది అందాల ఆరబోత కాదు, అందాల పారబోత అని అంటారు ఫ్యాన్స్. అందాలను కుర్రాళ్ళ గుండె వాకిట్లో కల్లాపులా పారబోస్తుంటే పారబోత అనక ఇంకేమంటారు. నాభి అందాలను చూపిస్తూ కుర్ర గుండెల్లో సునాభి సృష్టిస్తోంది. సునామి అనేది ఈమె సృష్టించే సునాభి ముందు చిన్నదిలెండి. అందుకే ఆ పదం వాడవలసి వచ్చింది. ఇకపోతే ఈ బోల్డ్ బ్యూటీ నట్టి నటరాజ్ హీరోగా నటించిన ‘గురుమూర్తి’ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రమోషన్ లో భాగంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2009లో తాను కోలీవుడ్ కి పరిచయం అయ్యానని, ఇన్నాళ్ల పాటు హీరోయిన్ గా కొనసాగడం సంతోషంగా ఉందని వెల్లడించింది. తాను కుటుంబ కథా చిత్రాల్లో నటించానని, గ్లామర్ రోల్స్ లో నటించే అవకాశం రాలేదని అన్నది.
ఇక సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్న విషయంపై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తనకు దక్షిణాది నుంచి విపరీతంగా ఫేస్ బుక్ ఫ్యాన్స్ ఉన్నారని, వారందరూ తనను ఇలా గ్లామరస్ గా చూసేందుకు ఇష్టపడుతున్నారని తెలిపింది. తన గ్లామరస్ ఫోటోలను చూసి ఎంజాయ్ చేస్తున్న కారణంగానే తాను గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు గ్లామర్ కి, స్కిన్ షోకి తేడా ఉందని.. పరిధి దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదని పేర్కొంది. ఇప్పటివరకూ తాను అసలు స్కిన్ షోనే చేయలేదని చెప్పుకొచ్చింది. దీంతో నాన్ గ్లామర్ మనుషులు.. అసలు నీకు స్కిన్ అంటే ఏంటో తెలుసా? అని క్వశ్చనింగ్ చేసేస్తున్నారు.
స్కిన్ ని చూపిస్తే స్కిన్ షో అనక.. ఇంకేమంటారు పూను అని యాస్కింగ్ అన్న మాట. గ్లామర్ షోకి, స్కిన్ షోకి మధ్య దూరాన్ని ఎవరూ తగ్గించలేరు అని పూనమ్ బజ్వా అంటుంటే.. రెండిటికీ పెద్ద దూరం ఏమీ లేదు, ఈ విషయంలో పూనమ్ కూడా పెద్ద దూరంలో ఏమీ లేదు. చాలా దగ్గరగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ షో అయితే ఏంటి, స్కిన్ షో అయితే ఏంటి? పూనమ్ బజ్వా మా కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది అంటూ సమ్ అన్ పార్లమెంటరీ పీపుల్ ఫీలింగ్స్ అన్న మాట. పూనమ్ బజ్వా ఫీలింగ్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా ఇదే. చూసి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే చూపిస్తున్నా అని కామెంట్స్ చేసింది.