బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఏం మాట్లాడినా అదొక సంచలనం అవుతుంది. ఆ మధ్య విజయ్ దేవర కొండకి ప్రాక్టికల్ గా పెళ్ళైపోయిందంటూ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. మామూలుగా ప్రతీ ఒక్కరూ ఈఎంఐ బేసిస్ లో రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇల్లు కొనాలన్నా, కార్లు కొనాలన్నా, ఏం కొనాలన్నా ఎక్కువ మంది బ్యాంకు లోన్లు తీసుకునే కొంటారు. ఆ లోన్లను నెల నెలా ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తారు. మన జూనియర్ అతిలోక సుందరి కూడా ఈఎంఐలు కడుతూ ఉంటుందట. అయితే ఆ ఈఎంఐల కోసం డబ్బు ఎలా సంపాదిస్తాదో వెల్లడించింది.
ఆమె నటించిన ‘మిలీ’ మూవీ మొన్ననే రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మత్తెక్కించే ఫోటోషూట్లు, బోల్డ్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చెమటలు పట్టించే ఈ బ్యూటీ తాను అలా చేయడానికి గల కారణం ఏంటో చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాను సీరియస్ గా తీసుకోనని, ఏదో సరదాగా మాత్రమే తీసుకుంటానని వెల్లడించింది. అయితే తాను అందంగా, క్యూట్ గా కనబడితేనే.. ఇంకో 5 మంది తన ఫోటోలను లైక్ చేస్తారని, తనకు ఇంకో బ్రాండ్ ని ప్రమోట్ చేసే అవకాశం వస్తుందని చెబుతుంది.
ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయగా వచ్చిన డబ్బులతో ఈఎంఐలు చెల్లిస్తున్నానని, హాట్ పిక్స్ పెడితేనే ఈఎంఐలు చెల్లించడం సులువు అవుతుందని వెల్లడించింది. ఓహ్ ఇదా అసలు మేటర్. ఇందుకేనా హీరోయిన్లు యూజర్లను ఆకర్షించేలా హాట్ ఫోటోలు, అప్పుడప్పుడూ క్యూట్ ఫోటోలు పెడుతుంటారు. ‘మరి లేకపోతే ఊరికే పెట్టేస్తారా ఫోటోలు. ఇది యాపారం’ అని జాన్వీ కపూర్ మాటలను బట్టి అర్థమవుతుంది. సోషల్ మీడియాను సరదాగా తీసుకుంటేనే ఆమె ఫోటోలు ఇంతలా చెమటలు పట్టిస్తే.. ఇక సీరియస్ గా తీసుకుంటే ఇంకెంత వేడి పుట్టిస్తుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ బ్యాంకు లోన్లు ఏవో ఇంకా ఉంటే బాగుండేదని కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.