డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు మరోసారి రెడీ అయిపోయారు. గతంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమా తీసిన పూరీ.. ఫస్ట్ పిక్చర్‌తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత పూరీ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన లైగర్ మూవీ ఆగస్ట్ 25న గ్రాండ్‌గా రిలీజైంది. ఈ మూవీపై పూరీ చాలా అంచనాలు పెట్టుకున్నారు. కరోనా కారణంగా మూడేళ్ళ పాటు సినిమాలకి దూరమయ్యారు ఈ స్పీడ్ డైరెక్టర్. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ తన తండ్రి గురించి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
“మై ఫరెవర్ లవ్. నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత నెర్వస్‌గా లేను. రేపు ఒక బిగ్ డే. ఈరోజు కోసం చాలా కష్టపడ్డారు. ఇన్ని రోజుల కష్టానికి తగ్గా ఫలితం దక్కనుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, మేము ఎప్పుడూ నీ విషయంలో గర్వంగా ఉంటాము. నీ కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటాము. కొత్త అవకాశాలు రావాలంటే రిస్కులు చేయడానికి భయపడకపోవడం నీ నుండే ఆదర్శంగా తీసుకున్నాను. లైగర్ మూవీ టీమ్ మొత్తం ఎంత కష్టపడ్డారో, ఎంత స్ట్రగుల్ అనుభవించారో మాకు తెలుసు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. టీమ్ మొత్తానికి గుడ్ లక్. లైట్ మరింత ప్రకాశవంతంగా వెలగచ్చు. నువ్వు నా రాక్, నా బలహీనత నాన్న. సినిమా చూసేటప్పుడు రేపు నువ్వు నా దగ్గర భౌతికంగా ఉండకపోవచ్చు. కానీ సినిమా చూసినంత సేపూ నా ఆనందం, నా ప్రార్ధనలు, సగం విజిల్స్ నిన్ను చేరుకుంటాయి. నేను ఇక ఆగలేను. మేము నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాము” అంటూ పవిత్ర పూరీ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి పూరీ కూతురు షేర్ చేసిన ఈ పోస్ట్‌పై మీ అభిప్రాయన్ని కామెంట్ చేయండి.