స్వయంవరం సినిమాతో అందరి హృదయాలను గెలుచుకున్న అచ్చ తెలుగందం లయ. ఎక్కడా కూడా అశ్లీలతకు తావివ్వకుండా, మితిమీరిన ఎక్స్ పోజింగ్ జోలికి పోకుండా.. కేవలం ఫ్యామిలీ తరహా పాత్రలతోనే అభిమానుల మనసు దోచుకున్నారు. మొదటి సినిమాతోనే తన నటనతో మంత్రం ముగ్ధులను చేసిన లయ.. ఈ సినిమాతో స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కేటగిరీలో నంది అవార్డు గెలుచుకున్నారు. మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించి మెప్పించారు.
వరుస సినిమాలతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉందనుకున్న సమయంలో వివాహం చేసుకున్నారు. 2006లో గణేష్ గోర్టి అనే ఎన్నారై డాక్టర్ ని వివాహం చేసుకుని లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయ్యారు ఈ ఏంజిల్ దేవత. ఈమెకి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత ఈమె తెలుగులో 2010లో వచ్చిన ‘బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం’ సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ 8 ఏళ్లకి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కనిపించారు. అప్పటి నుంచి పూర్తిగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అప్ డేట్స్ ఇస్తుంటారు.
ఈ క్రమంలోనే ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూతురి ఫోటోను షేర్ చేశారు. సెప్టెంబర్ 25న డాటర్స్ డే సందర్భంగా.. తన కూతురితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. కూతురిని ముద్దాడుతూ “హ్యాపీ డాటర్స్ డే. అద్భుతమైన కూతురుగా ఉన్నందుకు కృతజ్ఞతలు శ్లోక. నేను చాలా అదృష్టవంతురాలిని” అంటూ రాసుకొచ్చారు. ఈ ఫోటోలో లయ కంటే అందంగా, కళగా ఆమె కూతురు శ్లోక కనబడుతోంది. మొత్తానికి ఇద్దరూ పద్ధతిగా, నిండైన సాంప్రదాయంతో సాంప్రదాయ ప్రియులను అలరిస్తున్నారు. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు.. ‘మీ పాప మీలానే ఉంది లయ మేడమ్’ అని, ‘ఇద్దరూ అక్కా చెల్లెల్లా ఉన్నారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా దసరా పండుగ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. మొదటి రోజు తెల్ల రంగు వస్త్రంలో అమ్మ వారిని అలంకరిస్తారు కాబట్టి తెల్లని చీర ధరించి అమ్మ వారికి పూజలు చేశారు. రెండవ రోజు ఎర్రని చీరలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. మూడవ రోజు రాజ నీలం, నాల్గవ రోజు పసుపు.. ఇలా తొమ్మిది రోజులు లయ ఆయా రోజులకు తగ్గా చీరలు కట్టి సాంప్రదాయం ఉట్టిపడేలా చేయనున్నారు. మన సంస్కృతిని కాపాడుతున్న లయకి ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు.