ఇదివరకు టీవీ యాంకర్స్ అంటే కేవలం షోలు హోస్ట్ చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయడమే అనుకునేవారు. ఎందుకంటే.. గతంలో యాంకర్స్ అనగానే ఎలాంటి గ్లామర్ షో చేయకుండా యాంకరింగ్ వరకే పరిమితమై వెళ్లిపోయేవారు. అప్పుడు సోషల్ మీడియా కూడా పెద్దగా అందుబాటులోకి రాలేదు. యాంకర్స్ అయినా హీరోహీరోయిన్స్ అయినా వారిని టీవీలలో చూడటమే. కానీ.. ఇప్పుడలా కాదు. సోషల్ మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది. కాబట్టి.. ఇప్పుడేమైనా చేసేయొచ్చని హీరోయిన్స్ మాత్రమే కాదు. ఒకప్పుడు టీవీ యాంకర్స్ గా ఓ వెలుగు వెలిగి, పెళ్లి చేసుకొని పిల్లలున్న యాంకర్స్ కూడా గ్లామర్ వైపు అడుగులేస్తున్నారు.
తెలుగు బుల్లితెరపై యాంకరింగ్ తో పాటు హోస్ట్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న వారిలో యాంకర్ కం సీరియల్ ఆర్టిస్ట్ శిల్పా చక్రవర్తి ఒకరు. చాలా ఏళ్ళ కిందటే టెలివిజన్ రంగంలో యాంకర్ గా శిల్పా చేసిన సందడిని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అంతేగాక అడపాదడపా సినిమాలలో సైతం మెరిసిన శిల్పా ఎక్కువగా టీవీ యాంకర్ రోల్స్ లోనే కనిపించడం విశేషం. శిల్పా యాంకర్ గా నటించిన సినిమాలలో హ్యాపీ ఒకటి. ఆ సినిమాలో అల్లు అర్జున్ తో శిల్పా చేసిన సంభాషణ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో అప్పటివరకూ యాంకర్ గా, సినీ సీరియల్ నటిగా మెరిసిన శిల్పా.. పెళ్లి చేసుకొని ఒక్కసారిగా కెమెరా కంటికి దూరమైంది.
మొదట్లో మోడలింగ్ కూడా చేసిన శిల్పా చక్రవర్తి.. ‘వావ్: ది అల్టిమేట్ గేమ్ షో’ ద్వారా యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ‘కంటే కూతురినే కనాలి’ అనే సీరియల్ ద్వారా నటిగా మారింది. ఇక తక్కువ టైంలోనే మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్న శిల్పా.. కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి యాంకరింగ్, యాక్టింగ్ రెండింటికీ పుల్ స్టాప్ పెట్టేసింది. ఇక చాలా గ్యాప్ తర్వాత 2019లోబిగ్ బాస్ మూడో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పార్టిసిపేట్ చేసింది. కానీ, పెద్దగా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత నుండి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం స్టార్ట్ చేసింది శిల్పా.
ఇక సోషల్ మీడియాలో తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే శిల్పా.. ఈ మధ్య గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఫోటోలు పెడుతోంది. నెట్టింట శిల్పా చక్రవర్తి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. దుర్గామాత నవరాత్రుల సందర్భంగా శిల్పా పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇది మూడో రోజు కావడంతో అమ్మవారి త్రినయని గెటప్ లో శిల్పా ఫోటోలు పెట్టడంతో వార్తల్లోకెక్కింది. ఒకప్పటి యాంకర్ అయినప్పటికీ, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా క్లీవేజ్ షోలో కూడా ఏమాత్రం తీసిపోవడం లేదు శిల్పా. చూడాలి మరి ముందుముందు ఫ్యాన్స్ ని ఇంకెలా ఎంటర్టైన్ చేస్తుందో!