సాధారణంగా ఫ్యాన్ ఫాలోయింగ్ మిలియన్స్ లో ఉన్న సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే. సోషల్ మీడియా ద్వారానే తమ ప్రొఫెషనల్ విషయాలతో పాటు అప్పుడప్పుడు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంటారు. బయట ఫ్యాన్ బేస్ పరంగా హీరోలకు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అదే సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి హీరోలకంటే కూడా హీరోయిన్లకు ఎక్కువ. అలాగని హీరోయిన్స్ మాత్రమేనా అంటే.. ఈ మధ్య హీరోయిన్లను మించి గ్లామర్ షో చేస్తున్నారు టీవీ యాంకర్లు. టాలీవుడ్ లో గ్లామరస్ యాంకర్స్ ఎంతమంది ఉన్నా.. యాంకర్ శ్రీముఖి పంథా వేరు.
స్టార్ యాంకర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. ఈ మధ్యే అందాలను షో చేయడంలో అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవల డాన్స్ ఐకాన్ షోలో పింక్ డ్రెస్ లో హాట్ షో చేసిన ఈ యాంకరమ్మ.. ఆ తర్వాత వరుసగా గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా.. శ్రీముఖి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటమే కాదు.. అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో కూడా అందాలను షో చేస్తుంటుంది. ఈ క్రమంలో యాంకర్ శ్రీముఖికి సంబంధించి ఓ కొత్త వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శ్రీముఖి డాన్స్ ఐకాన్ ప్రోగ్రాం షూట్ కోసం రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తుంది.
ఈ వీడియోలో శ్రీముఖికి మేకప్ మెన్ టచప్ చేస్తుండగా.. ఇంకొకరు హెయిర్ సెట్ చేస్తూ, వేరొకరు ఫ్యాన్ పట్టుకోవడం చూడవచ్చు. అయితే.. ఇదంతా శ్రీముఖి క్యారవాన్ లో జరిగింది. క్యారవాన్ నుండి బయటికి వచ్చాక కూడా మొబైల్ తో వీడియో తీసేవారు శ్రీముఖి.. స్టేజిపైకి వెళ్లేవరకూ వీడియో తీయడం విశేషం. ఇందులో శ్రీముఖి స్టేజిపైకి వెళ్లి డాన్స్ ఐకాన్ జడ్జి రమ్యకృష్ణను కలవడం కూడా వీడియోలో చూడవచ్చు. ఇలా మొత్తానికి శ్రీముఖి స్టేజి మీదకు వెళ్లి యాంకరింగ్ స్టార్ట్ చేయకముందు జరిగే డైలీ రొటీన్ ని వీడియో చూపించిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కానీ.. డాన్స్ ఐకాన్ లోనే ఎందుకు శ్రీముఖి ఇంత గ్లామరస్ గా రెడీ అవుతుందనేది నెటిజన్స్ ప్రశ్న. శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న ఈ డాన్స్ ఐకాన్ రియాలిటీ షో.. ఆహా ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతోంది.