గ్లామరస్ యాంకర్ అనగానే అనసూయ, రష్మీ లాంటివాళ్లే గుర్తొస్తారు. కానీ వాళ్లందరి కంటే ముందు అంటే దాదాపు 15-20 ఏళ్ల క్రితం యాంకర్ గా యమ క్రేజ్ తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ బ్యూటీ ఈమె. గ్లామర్ కి తోడు తన వాయిస్ తో టీవీ ప్రేక్షకుల్ని ప్రతిసారి మెస్మరైజ్ చేసేది. తన రేంజ్ ని అప్పట్లోనే ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. ఆ తర్వాత పెళ్లి పిల్లలతో బిజీ అయిపోయింది. దీంతో సుమ లాంటి వాళ్లు ఆమె స్థానాన్ని కైవసం చేసుకుని బిజీ యాంకర్స్ అయిపోయారు. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నా అనుకుంటున్నారా.. అవును మీరు అనుకున్నది కరెక్టే. ఆమెనే పొడుగుకాళ్ల సుందరి ఉదయభాను.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 90ల్లో పుట్టిన ఎవరినా అడిగానే సరే యాంకర్ అనగానే ఉదయభాను పేరే చెబుతారు. ఎందుకంటే ‘సాహసం చేయరా డింభకా’ షో మొదలుకొని ‘ఢీ’ డ్యాన్స్ షో వరకు ఆమె చేయని ప్రోగ్రాం లేదు. అప్పట్లో ఈమెతో పాటు చాలామంది యాంకర్స్ ఉన్నప్పటికీ.. ఉదయభానుకి మాత్రం పోటీ ఇచ్చేవాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండేవారు కాదు. అంతలా ఈమె దూసుకుపోయేది. మంచి డ్యాన్సర్ కూడా అయిన ఈమె.. షోల్లోనూ అప్పుడప్పుడు కాలు కదిపేది. ఇక రానా హీరోగా చేసిన ‘లీడర్’ సినిమాలోనూ ప్రత్యేక గీతం కూడా ఆకట్టుకుంది. బిగ్ స్క్రీన్ పైనా తన నృత్యప్రతిభ చూపి అలరించింది. డ్యాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది.
ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు లవ్ మ్యారేజ్ చేసుకున్న ఉదయభాను.. యాంకరింగ్ కి పూర్తిగా దూరమైపోయింది. ఫ్యామిలీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది. ఈమెకి ట్విన్(కవలలు) డాటర్స్ కూడా పుట్టారు. ఇక వాళ్లు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత.. ఉదయభాను యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చింది. గతంలో ఉన్నట్లు క్రేజ్ లేకపోవడం, మహిళా యాంకర్స్ కూడా ఎక్కువైపోవడంతో ఈమెకి పెద్దగా ఛాన్సులు రావట్లేదు. దీంతో సోషల్ మీడియాలో ఉదయభాను యాక్టివ్ గా ఉంటోంది. ఈ మధ్యే యూట్యూబ్ ఛానెల్ కూడా మొదలుపెట్టింది. అలా ఇప్పుడు తన చిన్న కూతురితో తీసుకున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆమెని ముద్దాడుతూ, తెగ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీలో ఉదయభానుకి ఫ్యాన్స్ ఎంతమంది. కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: పుష్ప కలెక్షన్ల విషయంలో నోరు జారిన ఉదయభాను.. సోషల్ మీడియాలో రచ్చ