విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడల్లా ఓ దారికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విశ్వక్ సారీ చెప్పడంతో వివాదం సమసిపోతుందని అందరూ భావించారు. కానీ, దేవీ నాగవల్లి సినిమాటోగ్రఫీ మంత్రికి ఫిర్యాదు చేయడం, విశ్వక్ పై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో వివాదం ఇప్పుడే మొదలైందని కొందరు భావిస్తున్నారు. ఒక మహిళా యాంకర్ పై అభ్యంతరకర పదాలు ఎలా వాడతారంటూ విశ్వక్ పై కొందరు కన్నెర్ర చేస్తున్నారు. అయితే అటు సోషల్ మీడియాలో విశ్వక్ కు మద్దతు కూడా అదే స్థాయిలో లభిస్తోంది. నెటిజన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆ జాబితాలోకి గృహలక్ష్మీ సీరియల్ పేమ్ కస్తూరి శంకర్ చేరారు.
ఇదీ చదవండి: విశ్వక్ సేన్ పై మంత్రి తలసానికి ఫిర్యాదు చేసిన యాంకర్ దేవీ నాగవల్లి
సాధారణంగా కస్తూరి శంకర్ సమాజిక, రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తుంటారు. విశ్వక్ సేన్- యాంకర్ దేవీ నాగవల్లి మధ్య ముదురుతున్న ఈ వివాదంపై కస్తూరి శంకర్ తనదైనశైలిలో స్పందించారు. ‘నేను హిట్ సినిమా చూసిన తర్వాత విశ్వక్ సేన్ ఎంతో నచ్చాడు. ఈరోజు నేను విశ్వక్ సేన్ ది ఒక వీడియో చూశాను.. అతనంటే నాకు గౌరవం పెరిగింది. ఏ ప్రాంక్ వీడియో కల్పించలేనంత పబ్లిసిటీ ఆ న్యూస్ ఛానల్ విశ్వక్ కల్పించింది. సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వక్ సేన్ కు, అతని కొత్త చిత్రం అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ కస్తూరి శంకర్ స్పందించారు. కస్తూరి శంకర్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
I watched HIT and liked #VishwakSen
Today I watched a video and RESPECT @VishwakSenActor .No prank cud have got him the publicity that TV9 has generated for him!
All the best to a self made star and his new movie #AshokaVanamLoArjunaKalyanam @Vishwaksen_Team pic.twitter.com/5FMQaKemF0— Kasturi Shankar (@KasthuriShankar) May 2, 2022