అభిమానుల ఎంత ప్రేమ చూపిస్తారో.. కొన్నిసార్లు అలానే మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అంతెందుకు మొన్నటికి మొన్న.. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ మాల్ కి వెళ్తే.. ఓ ఆకతాయి, మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్ ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ ఘటన మరవక ముందే అలాంటిది మరొకటి జరిగింది. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ ని, ఓ అభిమాని భయపెట్టి వదిలేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి. అయినా సరే కథానాయికగా ఆమె పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. చెప్పాలంటే రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ బ్యూటీ తాజాగా ముంబయి ఎయిర్ పోర్టులో మీడియా కంటపడింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఆ సమయంలో ఎంతో ఇబ్బంది పడిన కరీనా.. ఎలాంటి కోపం ప్రదర్శించకుండా కూల్ గా ఉండటానికి ప్రయత్నించింది. కానీ సడెన్ గా వచ్చిన ఓ అభిమాని, సెల్ఫీ కోసం కరీనాపై చేయి వేయడానికి ట్రై చేశాడు.
Kareena Kapoor Khan with some fans with some unusual move I A S Media #KareenaKapoorKhan #airport #fans #bollywood #Karma pic.twitter.com/C7WAj4HSvN
— A S Media©🇮🇳 (@ASMedia_India) October 3, 2022
కరీనాపై చేయి వేయడాన్ని గమనించిన ఓ సెక్యురిటీ గార్డ్.. అతడికి అడ్డుపడ్డాడు. అయితే సడన్ గా ఆ అభిమాని చేసిన పని చూసి, కరీనా ఒక్కసారిగా భయపడింది. ఆ సమయంలో అది ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. సదరు వ్యక్తిని తిట్టారు. ఫ్యాన్స్ అని చెప్పి, నటీనటుల్ని ఇలా ఇబ్బంది పెడతారా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి కరీనా భయపడటం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.