క్సెలబ్రిటీలు అన్నాక ఆన్ స్క్రీన్ లో ఒకలా, ఆఫ్ స్క్రీన్ లో ఒకలా ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. కొందరు సెలబ్రిటీలు ఆన్ స్క్రీన్ లో ఆకట్టుకుంటే.. మరికొందరు ఆఫ్ స్క్రీన్ లో ఫ్యాన్స్ కి దగ్గరవుతుంటారు. అయితే.. కొందరి విషయంలో మాత్రం ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. హీరోయిన్స్ విషయానికి వస్తే.. దక్షిణాది ఇండస్ట్రీలో కట్టుబొట్టు ఒకలా ఉంటే.. బాలీవుడ్ హీరోయిన్స్ కట్టుబొట్టు కాస్త వెస్టర్న్ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు.
సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ ఎలా ఉన్నా, ఎంత మోడరన్ గా ఉన్నా స్వాగతించే ప్రేక్షకులు, సమాజం.. హీరోయిన్ కి పెళ్లయ్యాక, అందులోనూ పిల్లలు పుట్టాక మోడరన్ దుస్తులలో కనిపిస్తే ఖచ్చితంగా ఎంతోకొంత ట్రోలింగ్ కి గురవుతారు. కానీ.. ఇప్పుడున్న టెక్నాలజీ, సోషల్ మీడియా మాధ్యమాల నడుమ పెళ్ళైన హీరోయిన్స్ కొంచం అటుఇటుగా కనిపించినా వెంటనే ట్రోల్స్ మొదలైపోతాయి. అయితే.. సినీఫీల్డ్ కాబట్టి పెళ్ళైనా కాకపోయినా ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండేందుకు ట్రై చేస్తుంటారు హీరోయిన్స్.తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్.. మోడరన్ గా కనిపించేందుకు ప్రయత్నించి ట్రోల్స్ కి గురైంది. ఇటీవల కరీనా గుస్సీ ఎల్లో టీషర్ట్ తో బయట కనిపించింది. వెంటనే ఫొటోగ్రాఫర్లు కరీనాను కెమెరాలో బంధించి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. ఫోటోలైతే వైరల్ అయ్యాయి. కానీ కరీనా ధరించిన టీ షర్ట్ పై మాత్రం లెక్కలేనన్ని విమర్శలు వెల్లువెత్తాయి. అదీగాక.. కరీనా టీషర్ట్ ధర రూ. 40 వేలకు పైనే ఉంటుందని సమాచారం. ‘నీ టేస్ట్ ఏడ్చినట్లుంది, మాకు రూ.150 పెడితే ఇలాంటివి మూడు టీషర్ట్స్ వస్తాయి” అంటూ ట్రోల్ వేస్తున్నారు. అయితే.. కరీనా దగ్గర ఇలాంటి టీ షర్ట్స్ 50కి పైనే ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.