హిందువుల జీవితాల్లో రామాయణ, మహాభారత గ్రంథాలకు విశిష్ట స్థానం ఉంది. రామాయణంలోని సీతాదేవి పాత్ర ఒక ఆదర్శనీయమైన భార్యకు చిహ్నంగా పరిగణించబడుతుంది. యుగాలు మారినా సీతారాములను ఆదర్శ దంపతులుగా చెప్పుకుంటారు. ఆలూమగల అనురాగానికి ఈ జంట అన్ని కాలాల్లోనూ ప్రతీకగా నిలిచింది. ప్రముఖ సినీ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సీతని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ‘సీత: ది ఇంకార్నేషన్’. అలౌకిక్ దేశాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సీతగా ఎవరు నటిస్తున్నారనే విషయంపై పలు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సీత పాత్రలో కరీనా కపూర్ నటించనుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.
‘సీత’ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించడానికి రెండు నిబంధనలు విధించారట. ఒకటి ‘వీరే ది వెడ్డింగ్ 2’, దర్శకుడు హన్సల్ మెహతాతో సినిమా ముందు పూర్తి చేస్తానని చెప్పారట. ఎందుకంటే, ‘సీత’ చిత్రీకరణకు 7-8 నెలలు పడుతుంది. ఆ రెండు చిత్రాలకు రెండు నెలల కంటే ఎక్కువ సమయం పట్టదు. ఇంకొకటి పారితోషికంగా రూ. 12 కోట్లు అడిగారట. సాధారణంగా ఒక్కో చిత్రానికి కరీనా కపూర్ రూ. 6 నుంచి రూ. 8 కోట్లు తీసుకుంటారని ముంబై టాక్. ‘సీత’కు ఎక్కువ రోజులు అవసరం కనుక రూ. 12 కోట్లు అడిగారట. మనోజ్ ముంతాషీర్ సాహిత్య, సంభాషణలు సమకూరుస్తున్నారు. పూర్తిస్థాయి వీఎఫ్ఎక్స్ సాంకేతికతో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరికీ తెలియని సీతని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు.