కంగనా రనౌత్.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ దూసుకుపోతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. ఇక నటిగానే కాకుండా కంగనా సామాజిక మధ్యమాల్లో ప్రతి సమస్యసై స్పందిస్తూ పరోక్షంగా ప్రధాని మోదీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతును తెలుపుతూ ఉంటుంది. అయితే బుధవారం పంజాబ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ కాన్వయ్ ని కొందరు నిరసనకారులు అడ్డుకున్న విషయం తెలిసిందే.
దీంతో ప్రధాని భద్రత విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఇదే బాటలో వెళ్లి కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోదీ కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారుల విషయంలోనే కాకుండా భద్రతపై కూడా స్పందిస్తూ.. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చింది. పంజాబ్ లో జరిగింది చాలా సిగ్గుచేటు, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజల ప్రతినిధి అయిన దేశ ప్రధానిపై దాడి జరిగితే ఈ దాడి ప్రతి భారతీయుడిపై జరిగినట్లే అని కంగనా తెలిపిందిఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని, ఇదే కాకుండా పంజాబ్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి దాడులను అరికట్టకపోతే భారీ రానున్న రోజుల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పదని కంగనా రనౌత్ సూచించింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో కంగనా పెట్టిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.