ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు యూఎస్‌కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా మారారు. ఈ క్రమంలో ఆయన తాజా ఫొటో షూట్‌కు సంబంధించిన స్టిల్స్ బయటకు వచ్చాయి. నెట్టింట ఈ ఫొటోలు రచ్చ చేస్తున్నాయి.
ప్రపంచ సినిమాలో ప్రతిష్టాత్మక అవార్డుగా చెప్పుకునే ఆస్కార్స్‌కు అంతా సిద్ధమైంది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఈ పురస్కారం వస్తుందా అని యావత్ భారతావని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఇక, ఆస్కార్ ఈవెంట్ కోసం యూఎస్‌కు వెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ పనిలో పనిగా తమను కూడా హాలీవుడ్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వరుస ఇంటర్వ్యూలతో అక్కడ హంగామా చేస్తున్నారు. అవకాశం వస్తే ఇంగ్లీషు సినిమాల్లో నటిస్తామని అంటున్నారు. చెర్రీ అయితే ఆ దిశగా ఒక స్టూడియోతో చర్చలు కూడా సాగుతున్నాయని, త్వరలో శుభవార్త చెబుతానంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా వేర్వేరు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న చరణ్, తారక్‌లు.. ఇద్దరూ కలసి ఒకే ఇంటర్వ్యూ మాత్రం ఇంకా ఇవ్వలేదు. వీళ్లిద్దరూ వేర్వేరుగా ఇస్తున్న ఫొటో షూట్స్ ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఇందులో మాసీ లుక్‌తో అదరగొట్టాడు తారక్. బ్లూ సూట్లో ఆయన చాలా కూల్‌గా ఉన్నారని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ‘నాటు నాటు’ను ఆలపించిన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కూడా ఆస్కార్ వేడుక కోసం అమెరికా చేరుకున్నారు. మరి.. ‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Annaya New look pic.twitter.com/SSeFseHDYe
— Rajesh Ntr Follower (@RajeshNtrFollow) March 11, 2023