యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా స్పెషలే. ఆయన సినిమాల కోసం అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏం చేసినా ప్రత్యేకమే. నటనతో పాటు తన వాక్చాతుర్యంతోనూ ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో ఆయన అలవోకగా మాట్లాడగలరు. భాషలతో పాటు యాసతోనూ తాను నటించే సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోస్తుంటారు ఎన్టీఆర్. ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్ పాత్రలో తెలంగాణ యాసతో అదరగొట్టారాయన. చక్కటి మాటతీరుతో అందర్నీ మెప్పించే టాలెంట్ ఉన్న ఎన్టీఆర్ సినిమాలతో పలు టాక్ షోలకు హోస్ట్‌గానూ వ్యవహరించిన సంగతి విదితమే. తెలుగు ‘బిగ్‌బాస్’ షోకు తారక్ హోస్ట్ చేయడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌కూ ఆయన హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షోకు కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి.
ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి హాస్ట్‌గా మారబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఈసారి ఆయన ఓటీటీలో వచ్చే ఒక టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్లో ఒక టాక్ షోను హోస్ట్ చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహాలో ‘అన్‌స్టాపబుల్’ షోను హోస్ట్ చేశారు. ఆయన కెరీర్ బూస్టింగ్కు ఈ షో చాలా ఉపయోగపడిందని చెప్పొచ్చు. వ్యూస్ పరంగా ఈ షో దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో బాబాయ్ చేసిన షోకు దీటుగా అబ్బాయ్ ఎన్టీఆర్ షో అదే రేంజ్లో హిట్ అవుతుందా, వ్యూస్ రాబడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ షో ఏ స్థాయిలో హిట్ అవుతుందో తెలియదు గానీ.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’తో దాన్ని తప్పకుండా పోలుస్తారని మాత్రం చెప్పొచ్చు.