సాధారణంగా, సినిమాలు, రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు.. తమ తర్వాత వారి కుటుంబ సభ్యులను ఆయా రంగాల్లోకి ప్రవేశపెడతారు. రాజకీయాల్లో కన్నా కూడా సినిమా ఇండస్ట్రీలోనే వారసులు అధికం. పైగా చాలా మంది సీనియర్ నటీనటులు.. తమ వారసులుగా ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. ఇక కొద్ది రోజుల క్రితమే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే వార్తలు చూశాం. తాజాగా ఈ జాబితాలోకి.. హీరోయిన్, మంత్రి రోజా కుమార్తె కూడా చేరారనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయ. ఓ ప్రముఖ హీరో కుమారుడికి జోడిగా.. రోజా కుమార్తె అన్షు మాలిక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాలు..
తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి.. ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం మినిస్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయ్యే వరకు కూడా రోజా ఇండస్ట్రీలో కొనసాగారు. బుల్లితెర మీద పలు షోలకు జడ్జీగా రాణించారు. ఇక రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రోజా కుమార్తె అన్షు మాలిక తల్లికి తగ్గ కుమార్తెగా గుర్తింపు తెచ్చుకుంటుంది.
ఈ క్రమంలో తాజాగా రోజా తన కుమార్తె అన్షు మాలికను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఓ హీరో కుమారుడి సినిమాలో అన్షు నటించనుందనే వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఇక నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకోవడం కోసం రోజా.. తన కుమార్తె అన్షుని అమెరికాలోని ఓ ప్రముఖ యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ చేయించనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తలపై రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో రోజా తన కుమార్తె అన్షు మాలిక గురించి మాట్లాడుతూ.. తను స్కూల్‌లో టాపర్ స్టూడెంట్ అని.. చిన్న వయసులోనే ఓ స్వచ్చంద సంస్థను సంప్రదించి వారి సహాయంతో ఐదుగురు అనాథ పిల్లలకు సాయం చేస్తుందని చెప్పుకొచ్చింది. ఇక రోజా భర్త సీనియర్ డైరెక్టర్ ఆర్.కె.సెల్వమణి.. ప్రస్తుతం చెన్నైలోని సినీ కార్మికుల సంఘానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక రోజా కుమార్తె సినీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.