వైసీపీ మంత్రి రోజా.. టీడీపీ నేత నారా లోకేష్‌ని టార్గెట్ చేసి సెటైర్లు పేల్చారు. ఏకంగా లోకేష్ ఓ తింగరోడంటూ కామెంట్ చేశారు. అనుచరులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఎన్నికల హామీలన్ని నేరవేరుస్తున్నారని.. సర్వేలన్ని ఆయనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే.. వైసీపీ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు పేర్కొన్నాయన్నారు రోజా. ఈ సందర్భంగా లోకేష్‌పై విమర్శలు చేశారు రోజా. ఏపీలో తింగరోడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది నారా లోకేషే అంటూ రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఏ పరిశ్రమ ప్రారంభించిన.. అది తాము తెచ్చిందే అంటూ లోకేష్ ప్రచారం చేస్తున్నారని.. అసలు రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని ఆరోపిస్తున్నారని మండి పడ్డారు. లోకష్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదంటూ రోజా ఎద్దేవా చేశారు. అంబానీ, ఆదానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు.. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని రోజా తెలిపారు. ఇక ప్రభుత్వం పై బురదచల్లడం తప్ప.. టీడీపీకి మరేం చేతకాదని విమర్శించారు. తెలుగు దేశం పార్టీకి ప్రజల మనసు గెలవాలనే ఆలోచన లేకపోవడం సిగ్గు చేటన్నారు. వైఎస్ఆర్, జగన్‌లా ఒక్క పథకాన్ని అయినా చంద్రబాబు సరిగా అమలు చేశారా అని రోజా ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఫ్రెండ్‌షిప్ డే రోజు విమానంలో రోజాకు ఊహించని గిఫ్ట్.. వైరలవుతోన్న పోస్ట్! ఇది కూడా చదవండి: ఆవు దూడని రేంజ్ రోవర్‌లో తీసుకెళ్ళా.. జంతువులంటే అంత ఇష్టం: చికోటి ప్రవీణ్