బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్యలోని మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. తనదైన డైలాగ్ డెలివరిజం, స్టైల్‌తో షోని రక్తికట్టించాడు బాలయ్య. మొదటి సీజన్ సాధించిన రికార్డులతో.. సెకండ్ సీజన్‌ని కూడా ప్రాంరభించింది ఆహా టీం. తొలి సీజన్ మొత్తం.. సినీ సెలబ్రిటీలతో నడిస్తే.. సెకండ్ సీజన్‌కి మాత్రం కాస్త పొలిటికల్ టచ్ యాడ్ చేశారు ఆహా నిర్వాహకులు. సెకండ్ సీజన్ తొలి ఎపిసోడ్‌కి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కుమారుడు లోకేష్‌ను ఆహ్వానించారు. ఆ ఎపిసోడ్.. ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో.. ఎన్ని వ్యూస్ కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అన్‌స్టాపబుల్ సీజన్ 2 తర్వాత రెండు ఎపిసోడ్స్‌కి సినీ సెలబ్రిటీలు గెస్ట్‌లుగా వచ్చారు. ఈ క్రమంలో తాజాగా అన్‌స్టాపబుల్ షోకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ జోరుగా ప్రచారం అవుతోంది. అదేంటంటే.. బాలయ్య షోకి మరో మాజీ సీఎం గెస్ట్‌గా రాబోతున్నారట. ఆయన ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వ్యవహరించిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌గా రాబోతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి.
బాలయ్యకు, కిరణ్‌కుమార్ రెడ్డికి రాజకీయాల పరంగానే కాక.. వారి మధ్య మొదటి నుంచి స్నేహ బంధం ఉంది. అదెలా అంటే బాలయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. స్కూల్ డేస్ నుంచి వీరిద్దరూ మంచి మిత్రులు. ఈ క్రమంలో బాలయ్య షోకి కిరణ్ కుమార్ రెడ్డి గెస్ట్‌గా రాబోతున్నాడంటూ జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి ఇది గనక నిజం అయితే.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గనక అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్‌గా వస్తే.. ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు చోటు చేసుకుంటాయో.. ఎలాంటి ప్రశ్నలు వేస్తారో అని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు జనాలు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాలి.
Kiran Kumar With Balayya In unstoppable 2 pic.twitter.com/ED7CB3DYkb
— Sekhar Rambo (@RamboSekhar) November 14, 2022