తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డ్యాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ఒకటి. గత పదమూడు సీజన్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఢీ షో.. ప్రస్తుతం 14వ సీజన్ లో కొనసాగుతోంది. అయితే.. ప్రతివారం అదిరిపోయే పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంటున్న ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి ప్రోమో అంతా ఎంటర్టైనింగ్ గానే ఉంది. కానీ.. హైపర్ ఆది, రవికృష్ణల మధ్య ముద్దులు, హగ్గుల కోసం జరిగిన గొడవ హైలైట్ అయ్యింది.
ఇక ఢీ 14లో ప్రెజెంట్ గణేష్ మాస్టర్, హీరోయిన్ నందితా శ్వేతాలతో పాటు హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటిలాగే సరదాగా పెర్ఫార్మన్స్ బాగా చేసినవాళ్లను శ్రద్ధాదాస్ హగ్ ఇచ్చి అభిమానించి.. హైపర్ ఆదిని తన వద్దకు రమ్మని పిలిచింది. ఇంతలో ఆది వైఫ్ గా తేజు వచ్చి ఏం జరుగుతుంది నీకు శ్రద్ధకి మధ్య? అని అడుగుతుంది. మా ఇద్దరి మధ్య చిన్న డీల్ జరుగుతోంది కానీ నువ్వెళ్లు అని తేజుని అంటాడు.
పక్కనే ఉన్న శ్రద్ధాదాస్ కిస్ కాదు హగ్ ఇస్తాను అంటుంది. తొందరపడుతూ ‘ఏదో ఒకటిరా త్వరగా ఇవ్వు.. టైం లేదు’ అంటాడు ఆది. ఈ ముద్దులు, హగ్గుల తతంగమంతా గమనించిన రవికృష్ణ గట్టిగా అరుస్తూ అడ్డుపడతాడు. ఆదికి కోపం వచ్చేసి మా ఇద్దరి మధ్యకి ఎవరన్నా అడ్డొస్తే ఈరోజు శవాలు లేస్తాయి.. ఏ విషయంలో ఐనా గొడవ పెట్టుకోండి ఈ విషయంలో నా జోలికి రావద్దు అంటూ రవికృష్ణకి వార్నింగ్ ఇవ్వడం నవ్వు తెప్పిస్తుంది. ప్రస్తుతం ఆది, రవికృష్ణ మధ్య శ్రద్ధా కౌగిలి కోసం జరిగిన మాటల యుద్ధం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.