మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. మెగాస్టార్ చిరంజీవి పెర్ఫార్మెన్స్, ఆ స్టైల్, ఆ గ్రేస్ కి తోడు దర్శకుడు మోహన్ రాజా స్క్రీన్ ప్లే కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని లూసిఫర్ కథని చాలా మార్పులు చేశారు. లూసిఫర్ సినిమాని చెడగొడతారన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ విమర్శలకు చెక్ పెడుతూ గాడ్ ఫాదర్ సినిమా మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దసరా బరిలో దిగడం కూడా గాడ్ ఫాదర్ కి బాగా కలిసొచ్చింది. మొదటి రోజు మెగా మాసివ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన గాడ్ ఫాదర్.. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. కలెక్షన్స్ తో బాక్సాఫీస్ బద్దలవుతుంది. మొదటిరోజు వరల్డ్ వైడ్ షేర్ షేర్ 18 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ 32 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.
69.12 crores in 2 Days ❤️🔥
HUMONGOUS BLOCKBUSTER #GodFather setting the box office on fire 🔥
Book your tickets now
– https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfatherMegastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman @ProducerNVP pic.twitter.com/yBVyHA5t8D
— Konidela Pro Company (@KonidelaPro) October 7, 2022
రెండో రోజు కలెక్షన్స్ చూస్తే.. నైజాం 2.40 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, గుంటూరు 50 లక్షలు, కృష్ణా 50 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా 51 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా 34 లక్షలు, నెల్లూరు 33 లక్షలు వసూలు చేయగా.. యూఎస్ఏ లో 1.02 కోట్లు వసూళ్లను రాబట్టింది. దీంతో రెండో రోజు వరల్డ్ వైడ్ షేర్ 35 కోట్లు సాధించింది. రెండు రోజుల వరల్డ్ వైడ్ 69.12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. గాడ్ ఫాదర్ సినిమా రెండు రోజుల్లో 69.12 కోట్లు కలెక్ట్ చేసిందని, భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందని.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ అధికారిక పేజీలో వెల్లడించింది. మొదటిరోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 32 కోట్లు, రెండో రోజు 35 కోట్లు.. ఇంకా శుక్రవారం, శనివారం, ఆదివారం వీకెండ్ ఎలాగూ ఉంది. కాబట్టి బ్రేక్ ఈవెన్ (92 కోట్లు) సాధించాలంటే ఈ ఒక్కరోజు చాలని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మెగాస్టార్ గాడ్ ఫాదర్ తో మెగా విస్ఫోటనాన్ని సృష్టిస్తున్నారు.