ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి’ గాడ్ ఫాదర్’ మేనియా. చిరు చేసిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయితే ఈ సారి ఎలాగైన సరే హిట్ కొట్టాలని గట్టిగా ఉన్న మెగాస్టార్.. తాను అనుకున్నది సాధించారు. అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ వసూలు సాధిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా, రూ. 69.12 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మెగాఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్, రీమేక్ లా రారాజు గుర్తింపు పొందిన మోహన్ రాజా తెరక్కెకించారు. మలయాళ మూవీ లూసిఫర్ మూవీకి ఇది రీమేక్ అయినప్పటికి తెలుగు నెటివిటీకి తగ్గట్లు గాడ్ ఫాదర్ మూవీని మోహన్ రాజా తెరకెక్కించి.. సూపర్ హిట్ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన తన గత సినిమాలకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
‘హనుమాన్ జంక్షన్’ సినిమాతో మోహన్ రాజా దర్శకుడు తెలుగు తెరకు పరిచమయ్యారు. ఆ తర్వాత తన సోదరుడు జయం రవితో జయం సినిమాను తమిళంలోకి రీమేక్ చేసి మంచి విజయం సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో హీరో రవికి, మోహన్ రాజాకి మంచి గుర్తింపు లభించింది. అనంతరం అనేక రీమేక్ సినిమాలు చేస్తూ మంచి హిట్లు సొంతం చేసుకున్నాడు. అందరు మోహన్ రాజాను మోస్ట్ సక్సెస్ ఫుల్ రీమేక్ మూవీస్ డైరెక్టర్ గా పిలుస్తారు. తాజాగా మెగాస్టార్ చిరుతో మలయాళ మూవీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేసి.. అఖండ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం అన్ని థియేటర్ల గాడ్ ఫాదర్ దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ రాజ్.. తన గత సినిమాల గురించి అనేక విషయాలు పంచుకున్నాడు. ధృవ సినిమాను ప్రభాస్ తో తీయాలనుకున్నానని మోహన్ రాజా తెలిపారు. ఇలా అనేక విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు.
మోహన్ రాజ్ మాట్లాడుతూ..”హనుమాన్ జంక్షన్ మూవీ చూసి.. నన్ను తెలుగు సినిమాలు చేయడానికి కొందరు నిర్మాతలు అడిగారు. ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’ అనే మూవీ నేను చేయాల్సింది. అయితే కొన్ని కారణలతో నా చేతుల్లో నుంచి ఆ మూవీ పోయింది. అయితే అదే సినిమాను తమిళ్ లో నేనే రీమేక్ చేశాను. నా తమ్ముడిని ఒక సినిమాకు పరిచయం చేసి మళ్లీ తెలుగులోకి వచ్చేద్దామనుకున్నాను. తమ్ముడి కెరీర్ కోసం తెలుగు సినిమాలను రీమేక్ చేస్తూ రావల్సి వచ్చింది. అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, జయం, బొమ్మరిల్లు మొదలైన సినిమాలు తెలుగులో నుంచి రీమేక్ చేశాము. మా తమ్ముడిని ముందుకు తీసుకెళ్లే విషయంలో కొంచెం తెలుగు వైపు రాలేదు కానీ… తెలుగు పరిశ్రమలో జరుగుతున్న విషయాలు, ఇక పరిస్థితుల గురించి మాత్రం అందరికంటే ఎక్కువ నేనే పరిశీలిస్తుండే వాడిని. 2010 ప్రభాస్ ని కలిసి ‘తనీఒరువన్’ కథ చెప్పాను. అది ఆయన కోసం సిద్ధం చేసిన కథ. ప్రభాస్ కూడా ఆసక్తి చూపించారు. అయితే మీ దగ్గర నుంచి ఓ మంచి కుటుంబ కథ చిత్రం కోసం ఎదురు చూస్తున్నాము అని అన్నారు. అలా ఆలోచిస్తున్న క్రమంలోనే విజయ్ తో సినిమా ఓ సినిమా ఓకే అయింది. మరోసారి 2015 ధృవ సినిమా చేస్తానని రామ్ చరణ్ గారిని అడిగాను. అప్పటికే ఆ సినిమాకి సురేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలా తెలుగులో సినిమా చేయాలనుకున్న ప్రతి సారీ ఎదో ఒకటి అడ్డు వస్తుంది” అని మోహన్ రాజా చెప్పుకొచ్చారు.