బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం సూపర్ స్టార్ హీరోగా ఎదిగాడు ప్రిన్స్ మహేష్ బాబు. నేటికి కూడా అమ్మాయిల కలల రామకుమారుడిగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ కుమారుడు మాత్రమే కాక.. స్టార్ హీరో అయినప్పటికి.. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే త్వవం మహేష్ బాబుది. ప్రేక్షకులు మాత్రమే కాక పలువురు సెలబ్రిటీలు సైతం ఆయనకు అభిమానులుగా ఉన్నారు. రీల్ మీదనే కాక రియల్ జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ.. మంచి మనసుగా గుర్తింపు త్చెకున్నాడు.నేడు ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా మెగస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘‘ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్‌ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు
మహేష్ బాబు.
ఆ భగవంతుడు అతనికి మరింత
శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻
Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂 pic.twitter.com/7fDFnDDtwi— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2022
ఇక ఈ ఏడాది మహేష్ బాబుసర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28(#SSMB28) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో సెట్స్‌పైకి రానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.