బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ఎక్కడ విన్నఆయన పేరే మార్మోగుతోంది. ఏ సోషల్ మీడియా సైట్‌లో చూసిన ఆయన లెటేస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైతే న్యూడ్ ఫోటోషూట్ ఫోటోస్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారో అప్పటి నుంచి రణ్‌వీర్‌సింగ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఒంటిపై నూలుపోగు లేకుండా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రణ్‌వీర్ చేసిన ఫోటో షూట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. రణ్‌వీర్ సింగ్ వ్యవహారంపై మీడియాలోను, సోషల్ మీడియాలోను దారుణంగా ట్రోలింగ్ జరిగింది. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ న్యూడ్‌గా ఫోటోషూట్ చేశాడు. 70వ దశకంలో పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్ ఈ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసి అప్పట్లో సంచలనం రేపాడు. బర్ట్ రేనాడ్స్‌కు నివాళిలర్పించేందుకు కోసం రణ్‌వీర్ సింగ్ ఈ ఫోటోషూట్ చేశాడు. గోడకు బల్లిలా అతుక్కొని.. నేలను కరుచుకొని రణ్‌వీర్ ఫోటోషూట్‌కు ఫోజిచ్చాడు.
ఈ ఫోటోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది. ‘సూపర్ హాట్’ అంటూ రణ్‌వీర్ కోస్టార్స్, అభిమానులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక నటుడి బోల్డ్ ఫోజులపై సోషల్ మీడియాలో పుట్టేడు మీమ్స్ సైతం పుట్టుకొచ్చాయి. మరోవైపు ఈ ఫోటోషూట్‌పై వివాదాలు, విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా నగ్న షోటోషూట్ రణ్‌వీర్‌ని చట్టపరమైన చిక్కుల్లో పడేసింది.
ఓ ఎన్జీఓ ఫిర్యాదు మేరకు రణ్‌వీర్ సింగ్‌పై ముంబైలో చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు.. రణ్‌వీర్‌కు చాలా మంది సెలబ్రిటీలు మద్దుతు ఇస్తుండటంతో.. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్‌సీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు. ఒకవేళ మహిళ ఫోటోషూట్ చేస్తే ఇప్పటికే ఆమె ఇంటిని తగలబెట్టే వారని, తనను చంపేస్తామని బెదిరించేవారని పేర్కొన్నారు. కాగా రణ్‌వీర్ కంటే ముందు విజయ్ దేవరకొండ, తరువాత విష్ణు విశాల్ సైతం న్యూడ్ ఫోటోలకు పోజులిచ్చి హాట్ టాపిక్‌గా మారారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.