ఠాగూర్ సినిమాలో ‘కూల్చడం నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు’ అని చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా. అచ్చం ఇలానే ఓ ఈ కామర్స్ షాపింగ్ వెబ్సైట్ ఆ డైలాగ్ కి తగ్గట్టు ఓ వింత పని చేసింది. “బట్టలు విప్పడం మీ అలవాటు, బట్టలు వేయడం మా అలవాటు” అనే అర్ధం వచ్చేలా ఓ సరికొత్తగా తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ లో అమెజాన్ అని, ఫ్లిప్ కార్ట్ అని చాలా ఈ కామర్స్ వెబ్సైట్లు ఉన్నాయి. వీటి మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక్కో కంపెనీ ఒక్కో స్ట్రాటజీని అప్లై చేస్తుంది. ఇప్పుడున్న యూత్ ని పలు కంపెనీలు మీమ్స్ తోనే ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అయిన ‘మింత్ర’ సరికొత్త మీమ్ తో తన బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటోంది. ఇటీవల రణ్ వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటోషూట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. పేపర్ మ్యాగజైన్ కోసం ఒత్తైన జుట్టుతో, నగ్నంగా కార్పెట్ పై కూర్చుని, పడుకుని.. ఇలా వివిధ భంగిమల్లో కెమెరాకు ఫోజులిచ్చాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని క్యాష్ చేసుకుందామని మింత్ర వెబ్సైట్ భావించింది. ఈ ఫోటోని అడ్డుపెట్టుకుని తమ బిజినెస్ ని సరికొత్తగా ప్రమోషన్ చేసుకుంటుంది. ఎరుపు రంగు ప్యాంటు, రెడ్ రోజెస్ తో ఉన్న తెల్ల రంగు చొక్కా ఉన్న శరీరానికి.. రణ్ వీర్ సింగ్ తల తగిలించి ఒక ఫోటోను పోస్ట్ చేసింది. 'ఫిక్సిడ్ ఇట్' అని ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఇది కాస్తా బాగా వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇది యాపారం అని ఒకరు, బాగా ఎడిట్ చేశారని మరొకరు, దీపికా పదుకునేకి కూడా లెగ్గింగ్స్ తొడగండి అని ఒక యూజర్.. ఇలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో పట్ల రణ్ వీర్ సింగ్ అభిమానులు మాత్రం సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. “మీ బిజినెస్ కోసం రణ్ వీర్ సింగ్ కి బట్టలు తొడగాల్సిన అవసరం లేదు, అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్” అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు. మొత్తానికి విప్పడం మీకు అలవాటు అయితే, వేయడం మాకు అలవాటు అన్నట్టు.. ‘మింత్ర’ భలే ప్రమోషన్ చేసుకుంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by MYNTRA (@myntra) ఇది కూడా చదవండి: Arjun Mother Passed Away: యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృ వియోగం! ఇది కూడా చదవండి: Chiranjeevi: చిరంజీవిపై విషప్రయోగం చేయించింది ఎవరు? ఇప్పటికీ వీడని మిస్టరీ?