సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ రాణించాలంటే.. ఆవగింజంత అదృష్టంతో పాటు.. అందమైన రూపం కూడా అవసరం అవుతుంది. ఇండస్ట్రీలో కొనసాగాలనుకునేవారు తమ రూపం పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు సర్జరీలను కూడా ఆశ్రయిస్తుంటారు.కానీ కొన్ని సార్లు అనుకోని సమస్యలు తలెత్తుతాయి. వీటిలో అరుదైన వ్యాధులు కూడా ఉంటాయి. కొన్ని చికిత్సకు లొంగుతాయి. మరి కొన్ని వ్యాధులు వచ్చినట్లు కూడా మనకు తెలియదు. ప్రమాదకర స్టేజ్‌కి చేరిన తర్వాతే బయటపడతాయి. ఈ కోవకు చెందిన వ్యాధే రామ్‌సే హంట్ సిండ్రోమ్. ఇది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల ముఖభాగం పక్షవాతానికి గురవుతుంది. ప్రతి లక్ష మందిలో 5 నుంచి 10 మంది ఈ వ్యాధి బారిన పడుతారు. ఇటీవలే స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ తాను రామ్‌సే హంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర నటి ఐశ్వర్య సఖుజ.. తాను కూడా రామ్ సే హంట్ బాధితురాలినేనని చెప్పుకొచ్చింది.
‘ఇది 2014 నాటి సంగతి. షూటింగ్‌లతో చాలా బిజీగా ఉన్నాను. నాకు గుర్తున్నంతవరకు అప్పుడు నేను మధ్యాహ్నం రెండు గంటల షిఫ్ట్‌కు వెళ్లాను. రోహిత్(ఐశ్వర్య భర్త) నన్ను చూసి.. ఎందుకు కన్ను కొడుతున్నావంటూ అడిగాడు. ఏదో జోక్ చేస్తున్నాడనుకుని లైట్ తీసుకున్నాను. కానీ తర్వాతి రోజు ఉదయం పళ్లు తోముకునేటప్పుడు విపరీతమైన నొప్పి వచ్చింది. తర్వాత నా రూమ్‌మేట్ నా ముఖం మారిపోతున్నట్లు గ్రహించింది. నేను వెంటనే డాక్టర్‌ను కలిశాను. అప్పుడు నాకు రామ్‌సే హంట్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు’’ అంటూ గుర్తుకు చేసుకుంది.
ఇది కూడా చదవండి: Naga Chaitanya: మేజర్ హీరోయిన్‌తో ప్రేమలో అక్కినేని నాగచైతన్య?
‘‘కానీ నేను ఒప్పుకున్న షెడ్యూల్స్ కారణంగా విశ్రాంతి తీసుకోలేదు. నా ముఖం సగం కనిపించకుండా జాగ్రత్తపడుతూ షూటింగ్స్ చేశారు. తర్వాత స్టెరాయిడ్స్ ఇచ్చి వైద్యం అందించారు. నటిగా అందంగా కనిపించడం ఎంతో ముఖ్యం. తిరిగి నార్మల్ అవుతానో లేదోనని భయపడ్డాను. కానీ నెల రోజుల్లోనే ఈ వ్యాధి నుంచి కోలుకున్నాను. జస్టిన్ బీబర్ కూడా దీన్నుంచి తప్పకుండా బయటపడతాడు’ అని చెప్పుకొచ్చింది. కాగా ఐశ్వర్య చివరగా 2019లో ‘ఉజ్దా చమాన్’ సినిమాలో ఏక్త పాత్రలో నటించింది. ‘సాస్ బీనా ససురాల్’, ‘ఆషికి’, ‘త్రిదేవియాన్’, ‘యే హై చహతే’ వంటి పలు సీరియల్స్ చేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Meesho ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 365 రోజులు సెలవు పెట్టినా జీతం ఇస్తారంట!
Went through heavy emotional turmoil, because as an actor, my face is everything: @ashsakhuja on battling #RamsayHuntSyndrome few years back, like @justinbieber
Tap to read: https://t.co/8PDAsLKONo#AishwaryaSakhuja #FaceParalysis #JustinBieber #JustinBieberFC #SaasBinaSasural pic.twitter.com/GZ1qfZPJ78
— Delhi Times (@DelhiTimesTweet) June 20, 2022