సమాజంలో ఎన్నో జంటలు అన్యోన్యంగా కలసి జీవిస్తుంటే..కొందరు దంపతులు మాత్రం మనస్పర్థల కారణంగా విడిపోతుంటారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో వారు ఒకరిపై మరొకరు పరువు నష్ట దావా కూడా వేస్తుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు వేస్తుంటారు. ఇలా తమ మాజీ భార్యలపై, భర్తలపై పరువు నష్ట దావా వేసిన నటీ, నటులు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ నటుడు కూడా తన మాజీ భార్యపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
సమాజంలో ఎన్నో జంటలు అన్యోన్యంగా కలసి జీవిస్తుంటే..కొందరు దంపతులు మాత్రం మనస్పర్థల కారణంగా విడిపోతుంటారు. అంతేకాక కొన్ని సందర్భాల్లో వారు ఒకరిపై మరొకరు పరువు నష్ట దావా కూడా వేస్తుంటారు. అయితే ఈ పరువు నష్టం దావాలు అనేది సాధారణంగా సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు వేస్తుంటారు. ఇలా తమ మాజీ భార్యలపై, భర్తలపై పరువు నష్ట దావా వేసిన నటీ, నటులు ఎందరో ఉన్నారు. కొందరు తమ కేసులో విజయం సాధించగా.. మరికొందరు పోరాడుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు సైతం తన మాజీ భార్యపై, అతడి సోదరుడిపై పరువు నష్టం దావా వేశాడు. ఆ నటుడు ఎవరు .. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్దిఖీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి.. మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ ఇటీవలి కాలంలో ఈ నటుడు తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన మాజీ భార్య ఆలియా సిద్ధిఖీ, సోదరుడు షంసుద్దీన్ పై నవాజుద్దీన్ పరువు నష్టం దావా వేశారు. వారిద్దరూ తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, అలానే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన బాంబే కోర్టును ఆశ్రయించారు.
వారిద్దరు తనకు వెంటనే బహిరంగ క్షమాప చెప్పాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. అలాగే తన గౌరవానికి భంగం కలిగించేలా ఎలాంటి పోస్టులు, వ్యాఖ్యలు చేయకూడదని, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో తనపై పెట్టిన పోస్టులను డిలీట్ చేయాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా విడాకులు, ఆస్తుల విషయంలో ఆలియా, సిద్ధీఖీ మధ్య వివాదలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అలానే ఆలియా సోషల్ మీడియా వేదికగా నవాజుద్దిన్ పై పలు మార్లు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా నవాజుద్దీన్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. మాజీ భార్య ఆలియాతో పాటు సోదరుడు షంసుద్దిన్ పై కూడా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
2008 నుంచి తన దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్న తన సోదరుడు షంసుద్దీన్ తన మోసం చేశాడని సిద్ధీఖీ తెలిపారు. తన దగ్గర పని చేస్తున్న సమయంలో క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ వర్డ్ లు తీసుకుని తనను ఆర్థికంగా మోసం చేసి.. అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశాడని నవాజుద్దీన్ సిద్ధీఖీ పిటిషన్ లో తెలిపారు. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు తన మాజీ భార్యను ఉసి గొల్పాడని నవాజ్ తెలిపాడు. మరి.. మాజీ భార్యపై నవాజుద్దీన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.