గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే గాక.. దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ‘కాంతార’. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. కన్నడ పరిశ్రమలో చిన్న చిత్రంగా విడుదలై భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది కాంతార. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా థియోటర్లలోకి వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇక తెలుగులో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిలీజ్ చేయగా భారీ లాభాల్లో అల్లు అరవింద్ ను ముంచెత్తింది కాంతార మూవీ. మరి ఇంతటి ఘన విజయాన్ని సాధించిన చిత్రంపై ప్రముఖ దర్శకుడు విమర్శలు గుప్పించాడు. అసలు సినిమా ఏం బాలేదని, దాంట్లో ఏముందని జనాలు ఇంతగనం ఎగబడుతున్నారంటూ.. విమర్శించాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
చిన్న బడ్జెట్ తో తెరకెక్కి.. ఇండియా సినీ పరిశ్రమనే షేక్ చేస్తున్న చిత్రం కాంతార. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కూడా దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం కాంతార మూవీ చూసి చిత్ర యూనిట్ ను అభినందించారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ మూవీపై ప్రముఖ బెంగాలీ యంగ్ డైరెక్టర్ అభిరూప్ బసు విమర్శలు గుప్పించాడు. కాంతార సినిమా నాకు అస్సలు నచ్చలేదు. అసలు అంతలా ఏముందని జనాలు ఇంతలా ఎగబడుతున్నారని ప్రశ్నించాడు బసు. ఈ చిత్రం ప్రజల తెలివితేటలను అపహాస్యం చేసిందని అభిరూప్ అన్నాడు.
అదీకాక దేవుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దినట్లు ఈ సినిమాలో చూపించారని విమర్శించాడు. అదీ కాక క్లైమాక్స్ బాగుందని అందరు అంటున్నారు, కానీ నాకు అది బోరింగ్ గా అనిపించిందని అభిరూప్ బసు అన్నాడు. దాంతో అభిరూప్ బసుపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. నెటిజన్స్ అతడి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి చెత్త కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అంటు తిట్టి పోస్తున్నారు. మరికొందరేమో..”అభిరూప్ కాంతార లాంటి మూవీ సినిమా తియ్యలేడు కాబట్టే ఆ సినిమాపై విమర్శలు చేస్తున్నాడు” రాసుకొచ్చాడు. అసలు నువ్వు డైరెక్టర్ అని చాలా మందికి తెలీదంటూ మరికొంత మంది కామెంట్ చేశారు. పబ్లిసిటీ కోసమే బసు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని మరికొంత మంది నెటిజన్స్ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అభిరూప్ బసు చేసిన కామెంట్స్ పై హీరో రిషబ్ శెట్టి ఏవింధంగా స్పందిస్తారో చూడాలి.
We know Rishab Shetty & #Kantara Who The Fuck is Abhirup Basu?
— Satish R. (@SatishR_) October 28, 2022
#Kantara#Kantara OTT RELEASE NOVEMBER 4
Only (Kannada) language@PrimeVideoIN pic.twitter.com/cBIPXOsJuh— OTTGURU (@OTTGURU1) October 27, 2022