విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో లైగర్ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. శారీరకంగా, మానసికంగా పూర్తిగా మారిపోయానని విజయ్ దేవరకొండ ఎప్పుడో చెప్పేశాడు. ఇక సినిమా విజయం కోసం పూరి జగన్నాథ్ మాత్రం విజయ్‌తో నానా రకాల విన్యాసాలు చేయించినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ బోల్డ్ ఫోటోని రిలీజ్ చేశాడు పూరి. పూర్తిగా నగ్నంగా.. కేవలం పూల బోకే మాత్రమే అడ్డుగా పెట్టుకున్న విజయ్ దేవరకొండ పోస్టర్‌ని రిలీజ్ చేసి.. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. నెట్టింట ప్రస్తుతం ఈ ఫోటో గురించే రచ్చ నడుస్తోంది. చాలా మంది విజయ్ సాహాసానికి హ్యాట్సాఫ్ చెప్పగా.. కొందరు నెటిజనులు మాత్రం ఏం బాస్ ఏం మిగల్చలేదా అని కామెంట్ చేస్తున్నారు. ఈ బోల్డ్ పోస్టర్‌పై బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కామెంట్స్ చేస్తున్నారు. వీరిలో ఒకరి కామెంట్స్ మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
అనుష్క శెట్టికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ ఒరియెంటేడ్ మూవీలకు కెరాఫ్ అడ్రెస్‌గా మారింది అనుష్క. ఇక ఇంత క్రేజ్ ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం అంత యాక్టీవ్‌గా ఏమి ఉండదు. ఏదో పండుగలు, పబ్బాలు, తన సినిమా సమయంలో తప్పా ఇంకెప్పుడూ కూడా ట్వీట్లు గానీ పోస్టులు గానీ చేయదు. కానీ తాజాగా విజయ్ దేవరకొండ.. లైగర్ పోస్టర్ మీద రియాక్ట్ అయింది. దీనిపై అనుష్క చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Hyper Aadi: స్టేజిపైనే ఎమోషనల్ అయిన హైపర్ ఆది, వర్ష, ఇమ్మానుయేల్.. వీడియో వైరల్!
‘‘పూరి జగన్నాథ్ నుంచి ఇలాంటి మ్యాజిక్‌లు మున్ముందు ఇంకా చూడాలనుకుంటున్నాను.. విజయ్ ది బెస్ట్, ఎప్పుడూ కూడా ప్రయోగాలు చేస్తున్నాడు.. చార్మీ ఇంకా ఎన్నెన్నో కథలు చెప్పాలి.. ఎల్లప్పుడూ కొత్త కథలను కరణ్ జోహర్ ప్రోత్సహిస్తూనే ఉంటారు.. లైగర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అని అనుష్క ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూరి జగన్నాథ్ విజయ్ కాంబినేషన్లో రాబోతోన్న లైగర్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా హీరోగా నిలదొక్కుకోవాలని బాగానే ట్రై చేస్తున్నాడు. ఇక పూరి సైతం తన మార్క్‌తో ఇండియన్ బాక్సాఫీస్ మీద దాడి చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తగ్గట్టుగానే లైగర్‌ను రూపొందించినట్టున్నాడు.
ఇది కూడా చదవండి: Sushmita Sen: మూడు సార్లు పెళ్లి వరకు వెళ్లాను.. దేవుడి దయతో బయటపడ్డాను: సుస్మితా సేన్
అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఆగస్ట్ 25న వచ్చేందుకు రెడీగా ఉంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేశారు చిత్ర బృందం. ఇప్పటికే విడుదల చేసిన చిన్న టీజర్, సాంగ్, పోస్టర్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి.
ఇక ఇప్పుడు ఒక్కసారిగా అందరూ నోరెళ్లబెట్టేలా చేశాడు పూరి జగన్నాథ్. విజయ్‌ని న్యూడ్ గా నిల్చోబెట్టి.. అడ్డంగా పూల బొకెను పెట్టుకున్నాడు. మరి ఈ పోస్టర్ వెనుకున్న కథ, నేపథ్యం ఏంటి.. సినిమాలో ఈ సీన్‌కు ఉన్న ప్రాముఖ్యత ఏంటన్నది తెర మీదే చూడాలి. ఇక అనుష్క పెట్టిన ఈ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. స్వీటీ శెట్టి అంటూ లవ్ సింబల్‌తో రిప్లై ఇచ్చాడు విజయ్. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Ala Vaikunthapurramuloo Home: ‘అల వైకుంఠపురంలో’ మూవీలో కనిపించే ఇల్లు ఎవరిదంటే?