మల్టీ స్టారర్ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు తగ్గిపోయాయి. గతంలో మల్టీ స్టారర్ చిత్రాలు అధికంగా వచ్చేవి. ఇక ఈ మధ్యకాలంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శకుడు జక్కన్న ట్రిపుల్ ఆర్ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యం ఇస్తూ.. తెరకెక్కిన ఈ సినిమా సౌత్‌లోనే కాక.. బాలీవుడ్‌లో కూడా సత్తా చాటింది. ఈ క్రమంలో మరోసారి ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలపై చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్‌కు ఓ క్రేజీ న్యూస్ చెప్పాడు.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. బన్నీ-చెర్రి కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కిస్తానని వెల్లడించారు.
తాజాగా అల్లు అరవింద్.. ఆలీతో సరదాగా షోకు గెస్ట్‌గా వచ్చాడు. రెండు భాగాలుగా ప్రసారం అయిన ఈ ఎపీసోడ్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కిస్తానని.. అది కూడా తన గీతా ఆర్ట్స్ సంస్థ మీదనే అని తెలిపాడు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించాలనేది నా కోరిక. అది కూడా గీతా ఆర్ట్స్ సంస్థలోనే. ఇప్పటికే చరణ్-అర్జున్ పేరుతో టైటిల్ కూడా రిజస్టర్ చేయించాను.. ప్రతి ఏడాది దీన్ని రెన్యూవల్ చేయిస్తున్నాను. త్వరలోనే ఇది కార్యరూపం దాలుస్తుందని నా నమ్మకం.. విశ్వాసం’’ అని చెప్పుకొచ్చారు. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ వ్వాటే న్యూస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇప్పటికే బన్నీ-చెర్రి కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఎవడు చిత్రంలో వీరిద్దరు నటించారు. కానీ ఎవరి పాత్ర వారికి సెపరేట్. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ మాత్రం ఉండవు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ పైన బన్నీ-చెర్రి కాంబినేషన్‌లో సినిమా వస్తే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయం అంటున్నారు. మరి ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.