వడ్డే నవీన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఓ పదేళ్ల క్రితం వరకు కూడా ఆయన టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్నారు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆయన నటించిన పెళ్లి చిత్రం, ఆ సినిమా పాటలు ప్రేక్షకులును ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక వడ్డే నవీన్ తండ్రి ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన వడ్డే నవీన్.. అనతి కాలంలోనే టాప్ హీరోగా ఎదిగారు. ఆయన తన కెరీర్లో 30 వరకు చిత్రాల్లో నటించాడు. 2016లో రామ్‌గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎటాక్’ సినిమాలో నవీన్ చివరిగా కనిపించారు. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. సినిమాలకు దూరం ఆయిన తర్వాత ఆయన మీడియా ఎదుట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. కనీసం షోలలో కూడా కనిపించడం లేదు. తాజాగా కృష్ణంరాజు మరణించడంతో ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చారు.
ఈ క్రమంలో తాజాగా వడ్డే నవీన్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వెలుగు చూసింది. తెలుగులో కమెడియన్ ఆలీ నిర్వహించే షో ద్వారా త్వరలోనే అభిమానుల ముందుకు రానున్నట్లు తెలిపారు వడ్డే నవీన్. ఆలీ చేసే ఈ షోకు సంబందించిన ప్రోమోలు, వీడియోలు యూట్యూబ్‌లో అప్డేట్ చేస్తే చాలు.. కింద కామెంట్ సెక్షన్లో వడ్డే నవీన్ గారిని పిలవండి అని కోరేవారు ఎక్కువ. ఈ క్రమంలో అభిమానుల విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని సదరు షో నిర్వాహాకులు.. వడ్డే నవీన్ గారిని కలిసి, మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు. ప్రసుత్తం ఇది నెట్టింట వైరలవుతోంది.
ఇక ఈ వీడియోలో జ్ఞాపిక ప్రొడక్షన్స్ నిర్మాత ప్రవీణ మాట్లాడుతూ.. వడ్డే నవీన్ తమకు మంచి స్నేహితుడని.. కాకపోతే ప్రసుత్తం ఆయన ఏ షోలకు రావడం లేదని.. ఇకనైనా తమను తిట్టడం మానమని కోరింది. ఇక ఆలీ మాట్లాడుతూ.. ‘‘నా షోలో పాల్గొనమని వడ్డే నవీన్‌ను చాలా సార్లు పిలిచాను. దానికి ఆయన.. తప్పకుండా వస్తాను.. కానీ ఏదైనా అద్భుతం చేశాకే వస్తాను అని చెప్పేవాడు. ఇక మా ఇద్దరి మధ్య 30 ఏళ్లుగా స్నేహం కొనసాగుతుంది. చెన్నైలో మేమంతా ఒకే వీధిలో ఉండేవాళ్లం. ఒక గొప్ప నిర్మాత కొడుకును అన్న గర్వం తనకు ఎప్పుడు ఉండేది కాదు. నవీన్ స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తాడు. ఇక త్వరలోనే ఆయన నా షోకి వస్తారు’’ అని తెలిపాడు ఆలీ.
ఈ వీడియో చూసిన నెటిజనుల.. పోనిలేండి ఇలా అయిన వడ్డే నవీన్‌ని చూశాం.. ఆయన ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తాం.. మా కామెంట్స్ చదివి.. రియాక్టయినందుకు థాంక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.